Vaishnavi Chaitanya: టాలీవుడ్‌లో ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డెట్ సంపాదించుకున్న నటి వైష్ణవి చైతన్య గురించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, తాను కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా కంటతడి వస్తుంది. వైష్ణవి పడిన ఆ కష్టాల వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం..
సెలబ్రిటీలు అందరూ లగ్జరీ లైఫ్ గడుపుతారని అందరూ అనుకుంటారు. కానీ వైష్ణవి చైతన్య నేపథ్యం పూర్తిగా భిన్నమైనది. కేవలం స్కూల్ లో చదువుతున్న వయసు నుంచే ఆమె తన కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ఇక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే తన కుటుంబాన్ని ఆదుకోవడానికి చిన్న వయసులోనే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. టిక్‌టాక్ వీడియోలు, డబ్ స్మాశ్‌లు చేస్తూ నెమ్మదిగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్‌లో నటిస్తూ కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నారు.
సినిమా షూటింగ్ సమయంలో చిన్న నటీనటులకు అప్పట్లో కారవాన్ సదుపాయం ఉండేది కాదు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ వైష్ణవి ఎమోషనల్ అయ్యారు. షూటింగ్స్‌లో సరైన రూమ్ లేదా కారవాన్ లేకపోవడంతో, పబ్లిక్ వాష్‌రూమ్‌లలోనే బట్టలు మార్చుకుని మేకప్ వేసుకుని రెడీ కావాల్సి వచ్చేదని చెప్పారు. ఆ రోజు మేము పెద్ద హీరోయిన్స్ కారవాన్ దగ్గరకు వెళ్లి మేడం మేము ఒక్కసారి మీ వాష్ రూమ్ వాడుకోవచ్చా అని అడగ్గా వాళ్ళు వద్దు అనే వాళ్ళు ఆ రోజుల్లో తాను పడ్డ ఇబ్బందులు తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని, అప్పట్లో ఎంతో బాధపడ్డానని ఆమె తెలిపారు.
also read: ఏపీలో తుఫాన్.. కీలక నిర్ణయం తీసుకున్న విశ్వక్ సేన్!
చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చిన వైష్ణవికి సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన ‘బేబీ’ సినిమా టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో పాటు ఇప్పుడు షూటింగ్స్‌లో తనకంటూ ప్రత్యేకంగా కారవాన్ ఇస్తున్నారని, ఆ రోజులను తలచుకుంటే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనిపిస్తుందని వైష్ణవి చెప్పారు.
మొత్తానికి చూస్తే, ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని అంచలంచెలుగా ఎదిగిన వైష్ణవి చైతన్య సక్సెస్ వెనుక ఎంతో కఠినమైన శ్రమ ఉంది. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నప్పటికీ, ఆమె పడిన తొలిరోజుల కష్టాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తినిచ్చేలా ఉన్నాయి.