E-Paper
Advertisement

జోరు పెంచిన నిహారిక.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ‘పాకెట్ రాకెట్స్’!

జోరు పెంచిన నిహారిక.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ‘పాకెట్ రాకెట్స్’!
Advertisement

Niharika konidela: టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో వస్తున్నా తాజా చిత్రం ‘పాకెట్ రాకెట్స్’ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం నాడు ఈ సినిమా టైటిల్ తో పాటు కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యూత్‌ఫుల్ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

విదేశీ విద్య.. గ్యాంబ్లింగ్ కథాంశం:

ఈ సినిమా కథ విదేశాల్లో పెద్ద చదువులు చదవాలని కలలుకనే ఒక నార్మల్ యువకుడు చుట్టూ తిరుగుతుంది. తన కలను తీర్చుకోవటం కోసం డబ్బు సంపాదించే క్రమంలో ఆ కుర్రాడు గ్యాంబ్లింగ్ చేస్తాడు.. ఆ తర్వాత అతనిలైఫ్ లో ఎదురైన ఊహించని పరిణామాలు, సవాళ్లు ఏంటనేది దర్శకుడు ఎంతో ఉత్కంఠభరితంగా తీసినట్టు తెలుస్తోంది.

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ లీడ్:

Advertisement

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన త్రినాథ్ వర్మ, కొత్త నటుడు నిర్మల్ ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నారు. ఇక ‘శుభం’ మూవీ లోని హీరోయిన్ శ్రియా కొంతం ఇందులోనూ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వీరికి తోడు వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో సందడి చేయబోతున్నారు.

అలరించే నటీనటులు.. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు:

ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, కిరిటీ దామరాజు వంటి టాలెంటెడ్ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు గ్యానీ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక అన్వర్ అలీ ఎడిటర్‌గా, విష్ణు వర్దన్ పుల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు.

షూటింగ్ పూర్తి.. త్వరలోనే టీజర్:

Advertisement

నిహారిక కొణిదెల నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే విజయవంతంగా క్యాంప్లైట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక త్వరలోనే ఈ మూవీ టీజర్‌తో పాటు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ALSO READ: కారవాన్ లోకి వెళ్తే ఛీ కొట్టారు.. స్టార్ హీరోయిన్ పై వైష్ణవి చైతన్య కామెంట్స్!l

ఇక మొత్తానికి చూస్తే, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు నిర్మిస్తూ జోరు పెంచిన నిహారిక కొణిదెల, ఈసారి గ్యాంబ్లింగ్ నేపథ్యంతో ‘పాకెట్ రాకెట్స్’ రూపంలో మరో ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నారు. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

కారవాన్ లోకి వెళ్తే ఛీ కొట్టారు.. స్టార్ హీరోయిన్ పై వైష్ణవి చైతన్య కామెంట్స్!l

ఏపీలో తుఫాన్.. కీలక నిర్ణయం తీసుకున్న విశ్వక్ సేన్!

దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

Big Stories

Advertisement
×