Manchu Manoj:టాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మంచు మనోజ్ (Manchu Manoj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు వరుస చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు పలు సినిమాల ఈవెంట్లకు హాజరవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’ సినిమా థర్డ్ సింగిల్ లాంచ్ కి ప్రత్యేక గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి హారన్.వి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
డీకొల్లు శ్రీధర్ సమర్పణలో గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
మంచు మనోజ్ కెరియర్ విషయానికొస్తే.. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన ఈయన.. ఆ తర్వాత భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో తనదైన నటనతో ఆకట్టుకొని, మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు. అలాంటి ఈయన వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకవైపు హీరోగానే కాకుండా మరొకవైపు ప్రతినాయకుడి పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల తేజ హీరోగా నటించిన మిరాయ్ చిత్రంలో విలన్ గా నటించిన ఈయన.. ఇప్పుడు గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటిస్తున్న దాదా చిత్రంలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు.
also read:వామ్మో.. అదా శర్మలో ఇంత టాలెంట్ ఉందా.. మొన్న అలా.. నిన్న ఇలా..
మరోవైపు హీరోగా సినిమాలు ప్రకటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు మంచు మనోజ్. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. హనుమ రెడ్డి ఎక్కంటి దర్శకత్వంలో చారిత్రక యాక్షన్ డ్రామా అయిన డేవిడ్ రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటీష్ వలస పాలనకాలం నాటి కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషాప్కా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటు వరుణ్ కోరుకుంద దర్శకత్వం వహిస్తున్న వాట్ ది ఫిష్ చిత్రంతో పాటు వడ్డీ కాసులవాడు అనే చిత్రంలో కూడా మనోజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు