E-Paper
Advertisement

వామ్మో.. అదా శర్మలో ఇంత టాలెంట్ ఉందా.. మొన్న అలా.. నిన్న ఇలా..

వామ్మో.. అదా శర్మలో ఇంత టాలెంట్ ఉందా.. మొన్న అలా.. నిన్న ఇలా..
Advertisement

Adah Sharma: టాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనదైన అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది..కేవలం నటనలోనే కాకుండా తనలోని ప్రత్యేకమైన మల్టీ టాలెంట్‌తో అభిమానులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంటుంది ఈ భామ. తాజాగా ఆమె ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా పక్షుల సౌండ్స్ స్వయంగా అనుకరిస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదా శర్మలోని ఈ అరుదైన మిమిక్రీ టాలెంట్ చూసి నెటిజన్లు వామ్మో అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం..

నాచురల్ మిమిక్రీతో ఆశ్చర్యపరిచిన అదా:

అదా శర్మకు జంతువులు, పక్షుల శబ్దాలను అనుకరించడం అంటే చాలా ఇష్టం. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోయిల, కాకి, గుడ్లగూబ, నెమలి వంటి పక్షుల కూతలను అచ్చం అలాగే అనుకరిస్తూ వీడియోలను షేర్ చేసింది. ఎలాంటి టెక్నాలజీ సాయం లేకుండా ఆమె నోటితో పలికించిన పక్షుల రాగాలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

మొన్న అలా.. నిన్న ఇలా..:

Advertisement

కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకే పరిమితం కాకుండా పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో కూడా మీడియా ప్రతినిధులు, అభిమానుల కోరిక మేరకు ఆమె లైవ్‌లోనే పక్షుల కూతలను కూసి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. ఇక ఎలాంటి బెదురు లేకుండా స్పాట్‌లో ఆమె చేసే ఈ మిమిక్రీ స్టంట్స్ ప్రెజెంట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మొన్న ఆలా మిమిక్రి చేసి ,నిన్న ఇలా టాలెంట్ నిరూపించుకుంది..

హారర్ మూవీతో బోణీ.. టాలీవుడ్‌లో క్రేజ్:

ఇక 2008లో విడుదలైన హారర్ సినిమా ‘1920’తో అదా శర్మ నటిగా కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ నామినేషన్ అందుకుంది. ఇక ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ సరసన నటించిన ‘హార్ట్ ఎటాక్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ‘హాసీ తో ఫాసీ’, ‘కమాండో’ సిరీస్, ‘క్షణమ్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వరుస సినిమాలతో బిజీ బిజీ:

Advertisement

ఇటీవల ‘ది నక్సల్ స్టోరీ’, ‘సి.డి: క్రిమినల్ ఆర్ డెవిల్’, ‘తుమ్కో మేరీ కసమ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదా శర్మ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది గేమ్ ఆఫ్ గిర్గిట్’, ‘గవర్నర్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక త్వరలో ‘గజ్రా’ సినిమాతో మరాఠీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతోంది.

ALSO READ: కారవాన్ లోకి వెళ్తే ఛీ కొట్టారు.. స్టార్ హీరోయిన్ పై వైష్ణవి చైతన్య కామెంట్స్!l

ఇక మొత్తానికి చూస్తే, వెండితెరపై సీరియస్ అండ్ పవర్ ఫుల్ రోల్స్‌తో మెప్పించే అదా శర్మ, బయట మాత్రం తనదైన క్యూట్ అండ్ క్రియేటివ్ టాలెంట్‌తో అందరినీ అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె పక్షుల శబ్దాలను అనుకరిస్తూ చేసిన వీడియోలు ప్రస్తుతం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!

మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ రిలీజ్!

జోరు పెంచిన నిహారిక.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ‘పాకెట్ రాకెట్స్’!

కారవాన్ లోకి వెళ్తే ఛీ కొట్టారు.. స్టార్ హీరోయిన్ పై వైష్ణవి చైతన్య కామెంట్స్!l

ఏపీలో తుఫాన్.. కీలక నిర్ణయం తీసుకున్న విశ్వక్ సేన్!

దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!

Big Stories

Advertisement
×