E-Paper
Advertisement

Dhruv Vikram : నువ్వు ఆ సినిమా చేయొద్దు, ధృవ్ విక్రమ్ కు స్ట్రాంగ్ గా చెప్పిన మారి సెల్వరాజ్ 

Dhruv Vikram : నువ్వు ఆ సినిమా చేయొద్దు, ధృవ్ విక్రమ్ కు స్ట్రాంగ్ గా చెప్పిన మారి సెల్వరాజ్ 
Advertisement

Dhruv Vikram : ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాను మిగతా భాషల్లో రీమేక్ చేసిన పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే ఒక భాషలో సినిమాలు ఇంకొక భాషలో చూడటం అనేది అప్పట్లో అరుదుగా జరిగేది. అందుకే చాలా తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసే వాళ్ళు. అయితే డబ్బింగ్ కానీ కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే ఆ ఆ సినిమాలను రీమేక్ చేసే ప్రయత్నాలు చేశారు కొంతమంది.

ముఖ్యంగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇళయ దళపతి విజయ్ మరియు జ్యోతిక నటించిన ఖుషి సినిమా కంటే కూడా దాని రీమేక్ పవన్ కళ్యాణ్ మరియు భూమిక నటించిన ఖుషి సినిమా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ సినిమాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ సినిమాకి ఆ ఫీల్ క్రియేట్ అయింది.

నువ్వు ఆ సినిమా చేయొద్దు 

Advertisement

అయితే ఈ రోజుల్లో ఒక రీమేక్ సినిమా చేయడం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకు అంటే ఒక భాషలో గొప్ప సినిమా ఉంది అంటే ఇప్పుడు ఉన్న ఆడియన్స్ వాళ్లకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ సినిమా నచ్చితే పదిమందికి తెలియచేసే ప్రయత్నంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతారు.

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన కిల్ సినిమాను తమిళ్లో దృవ విక్రమ్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నుంచి ద్రవ్ తప్పుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మారి సెల్వరాజ్ బైసన్ సినిమా తర్వాత నువ్వు అటువంటి సినిమాలు చేయొద్దు అని చెప్పారట.

దర్శకుడు మాటపై గౌరవం 

Advertisement

బైసన్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను డిజైన్ చేసిన విధానం అద్భుతంగా వర్కౌట్ అయింది. కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకు సంబంధించి ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. అంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమాను ధ్రువ విక్రమ్ కి మారి సెల్వరాజ్ ఇచ్చిన కారణంగా తన మాట వినాలి అని చెప్పి కిల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమా తెలుగు రీమేక్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అనే క్లారిటీ లేదు కానీ రిమైండ్ చేయటం మాత్రం పక్కా అని తెలుస్తుంది.

Also Read: Andhra King Taluka : రామ్ తో అనిల్ రావిపూడి సినిమా? ఆ షో లో ఆసక్తికర వ్యాఖ్యలు

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×