Heavy Rains in AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. పంటలు నీటమునగడంతో రైతులు లబో దిబో మంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది.
దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా వైపు కదులుతున్న అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా.. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తావైపు కదులుతుంది అని తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిది.
ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల పాటు ఏలూరు , ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు నేడు శ్రీకాకుళం,అల్లూరి, పార్వతీపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Also Read: బిగ్‌బాస్ జగనే! బీజేపీ దూకుడుకు రీజనేంటి?
పలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరుతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ, అవనిగడ్డ, జగ్గయ్యపేట, ఉంగుటూరు.. గుడివాడ దగ్గర బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. 5 మండలాల్లో 100కుపైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇవి ఇలా ఉంటే మున్నేరు, కట్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంకపల్లి దగ్గర బుడమేరు వాగుకు వరద పెరిగింది. ఉంగుటూరు-ఉయ్యూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావొద్దని, చిన్న పిల్లులు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా వైపు కదులుతున్న అల్పపీడనం
రానున్న 2 రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన
రాబోయే 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ రెండు జిల్లాలకు ఆరంజ్… pic.twitter.com/KL0xDeHIoc
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025