Film industry: తాజాగా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య భాషా యుద్ధం ముదురుతోందనే చెప్పాలి. అంతేకాదు ఒకరికొకరు దూషించుకునే స్థాయికి దిగజారిపోయారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Haasan).. తాను నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా “తమిళం నుండి కన్నడ పుట్టింది” అంటూ చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఏకంగా ఆ వ్యాఖ్యలు వల్ల కర్ణాటకలో సినిమా కూడా ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హైకోర్టు వరకు వెళ్ళిన కమలహాసన్ హైకోర్టు తీర్పుతో కన్నడిగుళకు క్షమాపణలు కూడా తెలియజేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్లో ధ్రువ సర్జా..
అయితే ఇప్పుడు ఈ వివాదంలోకి కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా (Dhruva sarja) వచ్చి చేరారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కేడీ : ది డెవిల్ (KD: The Devil). వైలెంట్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో రేష్మ నానయ్య హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్ , రమేష్ అరవింద్, శిల్పా శెట్టి కీలకపాత్రను పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండగా.. టీజర్ లాంచ్ చేశారు చిత్ర బృందం. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా ఒక తమిళ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించారు.
జోలికొస్తే అంతుచూస్తాం – ధ్రువ సర్జా
ధ్రువ సర్జా మాట్లాడుతూ.. “నేను పుట్టకముందు నుంచే తమిళ్ సినిమాలు కర్ణాటకలో విడుదలవుతున్నాయి. అయితే ఏ ఒక్క మూవీని ఎవరు కూడా ఆపలేదు. కానీ ఎప్పుడైతే కమల్ హాసన్ సార్ అలాంటి కామెంట్లు చేశారో అప్పుడే థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకున్నారు. ఎవరికైనా సరే మాతృభాష అంటే గౌరవం ఉంటుంది కదా.. అందరిలాగే మేము కూడా మా భాషను ప్రేమిస్తాము. మా భాష గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే స్పందించకుండా ఉండలేము కదా. ఒక్క థగ్ లైఫ్ సినిమా మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బంది లేకుండా రిలీజ్ అయ్యాయి. వాటిని కూడా ఇక్కడ ప్రజలు ఆదరించారు. ఇక ఎవరైనా సరే మా మాతృభాష జోలికొచ్చి , మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే అసలు ఊరుకోం.. ఖబడ్దార్ “అంటూ వార్నింగ్ ఇచ్చారు ధ్రువ సర్జా. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కమల్ హాసన్ రియాక్షన్ ఏంటి?
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ధ్రువ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇవి కమలహాసన్ వరకు చేరితే ఆయన రియాక్షన్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై కమలహాసన్ అసలు స్పందిస్తారా? స్పందిస్తే ఆయన రియాక్షన్ ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.
also read:Shruti Haasan: పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉంటే జరిగేది అదే.. శృతిహాసన్ హాట్ కామెంట్స్!