Ntr: రీసెంట్ గా నందమూరి ఫ్యామిలీ లో అనుకోని సంఘటన జరిగిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు నందమూరి పద్మజ చనిపోయిన విషయం తెలిసిందే. ఇది నందమూరి కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అప్పుడు ఆ ఫ్యామిలీ కోసం నిలబడిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
అయితే ఆ విషాదం తర్వాత నందమూరి బాలకృష్ణ చివరి వరకు అక్కడే ఉండి అన్ని పనులను తానే ముందుండి నడిపించారు. నటుడు చైతన్య కృష్ణ కూడా దగ్గరుండి లాస్ట్ రైట్స్ పూర్తి చేశారు. అయితే నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా నివాళులు అర్పించడానికి హాజరయ్యారు. అంతమంది హాజరైన తరుణంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
వాళ్లు హాజరయ్యారా?
సొంత ఫ్యామిలీ మెంబర్ చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ గానీ కళ్యాణ్ రామ్ గాని హాజరు కాలేదు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచండి. ఆ ఇద్దరు హీరోలని పర్సనల్ గా చాలా మంది కామెంట్ కూడా చేశారు. నందమూరి పద్మజ గారికి నివాళులు అర్పించడానికి Jr NTR, కళ్యాణ్ రామ్ ఆరోజు వాళ్ళు వెళ్లారు. ఎవరికి తెలియకపోవడానికి కారణం PR చేయలేదు Ntr టీం ఆరోజు. అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో వాదన. ఈ మాటలను బండారు సత్యనారాయణ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే అంత పెద్ద సెలబ్రిటీలు వచ్చినప్పుడు మినిమం వైరల్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది. దీన్ని బట్టి వాళ్లు వచ్చారు అనేది కూడా క్లారిటీ లేదు. బహుశా ఈ ఇంటర్వ్యూ తర్వాత మరికొన్ని వీడియోలు బయటకు వస్తే క్లారిటీ ఉంటుంది. కానీ బండారు సత్యనారాయణ మాట ప్రకారం నేను అక్కడే ఉన్నాను వాళ్ళిద్దరూ బ్లాక్ డ్రెస్ లో వచ్చారు డెడ్ బాడీ ని తీసుకెళ్లినంత వరకు అక్కడే ఉన్నారు అని తెలిపారు.
నందమూరి పద్మజ గారికి నివాళులు అర్పించడానికి Jr NTR రాలేదు అని ప్రచారం చేసారు. నిజానికి ఆరోజు వాళ్ళు వెళ్లారు. ఎవరికి తెలియకపోవడానికి కారణం PR చేయలేదు Ntr టీం ఆరోజు.
Source : Bandaru Satyanarayana pic.twitter.com/FQykG8KGxz
— Deep (@PHANI_TEJA99) August 26, 2025