BigTV English

Rajinikanth: ఆ మాటలు బాలకృష్ణ మాత్రమే చెప్పాలి, బాలకృష్ణ పై రజినీకాంత్ వీడియో

Rajinikanth: ఆ మాటలు బాలకృష్ణ మాత్రమే చెప్పాలి, బాలకృష్ణ పై రజినీకాంత్ వీడియో

Rajinikanth: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కుమారుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నారు.


అప్పట్లో బాలకృష్ణ చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. కమర్షియల్ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా, కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయడం అప్పట్లోనే మొదలుపెట్టారు. ఆయన కెరియర్ లో భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. బాలకృష్ణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినిమా పెద్దలు బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.

రజనీకాంత్ స్పెషల్ వీడియో 


ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఇలాంటి పంచ్ డైలాగులు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది. కానీ వేరేవరు చెప్తే బాగుండదు. బాలయ్య అంటే పాజిటివిటీ. ఆయన దగ్గర అసలు నెగెటివిటీ ఉండదు. ఆయనెక్కడుంటే అక్కడ సంతోషం ఆ నవ్వు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే వేరే ఎవరూ లేరు. బాలకృష్ణ సినిమా బాగా ఆడుతుంది అంటే ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది హీరోల అభిమానులకు సంతోషం కలుగుతుంది. ఆయన ఇప్పుడు 50 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నారు. ఇందుమూలంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ వీడియో పెట్టారు.

అన్ స్టాపబుల్ బాలయ్య 

ఒక తరుణంలో బాలకృష్ణ సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చేవి. బాలకృష్ణ సినిమాలు మీద అందరికీ ఒపీనియన్ కూడా పోయింది. ఆ తరుణంలో అన్ స్టాపబుల్ అనే షో బాలయ్య మీద ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ షో తర్వాత బాలయ్యను చూసే విధానం కూడా మారిపోయింది. అందుకే అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అఖండ సినిమా తర్వాత ఇప్పటివరకు బాలయ్య చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. ఇప్పుడు రాబోయే అఖండ 2 సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉండటం వలన వాయిదా వేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీవీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 4వ సినిమా ఇది.

Also Read: Pawan Kalyan: వద్దురా బాబు అని మొత్తుకున్న వినలేదు, పవన్ కళ్యాణ్ కు ఇలాంటి డిజాస్టర్

Related News

Pawan Kalyan : పబ్లిక్ మీటింగ్ విడిచి… అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కళ్యాణ్

Allu Kanakaratnamma : మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అల్లు కనక రత్నమ్మ

Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Big Stories

×