Dil Raju : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అంతేకాదు ఈయన బ్రాండ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ అదే స్పీడులో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi maran) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ కంపెనీల నేతృత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోని కూడా మేకర్స్ విడుదల చేసి.. సినిమాపై అంచనాలు పెంచేశారు.
వేగం పెంచిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
ఇదిలా ఉండగా మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కూడా వేగం పెంచారు. కేజీఎఫ్ 1,2 చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ప్రభాస్(Prabhas ) తో ‘సలార్’ సినిమా చేసి తన మార్కెట్ ను మరింత పెంచుకున్న విషయం తెలిసిందే . ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ సలార్ -2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ తన వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ప్రశాంత్ నీల్ ఇటు ఎన్టీఆర్(NTR )తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్ – ప్రశాంత్ కాంబో మూవీపై దిల్ రాజు క్లారిటీ..
అయితే ఇప్పుడు ఇలాంటి ఈ ఇద్దరు దిగ్గజాల కాంబోలో సినిమా రావాలి అని అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో బాగానే అల్లు అర్జున్ -ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అభిమానుల ఎదురుచూపుకు తెర లేపారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dilraju). తాజాగా ఆయన నిర్మిస్తున్న ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. ఈ మూవీ పై అప్డేట్ ఇస్తూ..” అల్లు అర్జున్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది. ఈ సినిమాకి ‘రావణం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసాము. ఈ చిత్రానికి నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. అయితే ఇప్పుడు వీరిద్దరూ కూడా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి ఇంకా కాస్త సమయం పడుతుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు..
టైటిల్ ఫిక్స్ చేస్తూ అంచనాలు పెంచిన దిల్ రాజు..
మొత్తానికైతే అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ ఉంటుందని.. ఈ మూవీకి రావణం అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసామని దిల్ రాజు క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. మొత్తానికి అయితే టైటిల్ ఫిక్స్ చేస్తూ అంచనాలు పెంచేశారు దిల్ రాజు. మరి ఈ దిగ్గజ కాంబోలో వచ్చే సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Hollywood actor Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత!