Tirumala Chirutha News: తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. అలిపిరి నుండి జూపార్క్ వెళ్లే రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఇక చిరుత దృశ్యాలను వాహనదారులు వారి సెల్ ఫోన్స్‌లో బంధించారు. తాజా వీడియోలు వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు టూవీలర్ వాహనాలపై వెళ్లే భక్తులకు అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉంటే నిన్న అన్నమయ్య భవనం సమీన అటవీ ప్రాంతంలో మరో చిరుత సంచరించింది. చిరుత మంగళవారం సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో ఇనుప కంచెను దాటుకొని వచ్చిన దృశ్యాలను సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీ కెమెరాలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు.. ఘటన స్థలానికి చేరుకుని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. కొంతకాలంగా తిరుమల పరిసరాల్లో చిరుతల సంచారం పెరిగింది. మెట్టు మార్గంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని భక్తులు టీటీడీని కోరుతున్నారు.
Also Read: అధ్యక్ష పదవి ఈటలకు ఎందుకు ఇవ్వలేదంటే?
ముఖ్యంగా అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకు, శ్రీవాకి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమలలో చిరుతలు కనిపించడం సాధారణమై పోయింది. ఈ మార్గంలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని ఇంతకు ముందు టీటీడీ ఆదేశించింది. మరోవైపు టీటీడీ ఎన్ని చర్యలు చేపట్టినా.. చిరుతలు మాత్రం భక్తులను భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల గుండా వెళ్లే భక్తులు అలర్ట్‌గా ఉండాలని టీటీడీవారు హెచ్చరిస్తున్నారు.
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం
అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే మార్గంలో వాహనదారులకు కనిపించిన చిరుత
అరవింద 'ఐ' ఆసుపత్రి సమీపంలో చిరుత సంచారం
చిరుత దృశ్యాలను సెల్ఫోన్లో బంధించిన వాహనదారులు pic.twitter.com/dSIawjLN1U
— BIG TV Breaking News (@bigtvtelugu) July 2, 2025