E-Paper
Advertisement

పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!

పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!
Advertisement

Dil Raju Brothers Face Trolls:”టికెట్ రెట్లు పెంచం కాక పెంచము”..ఇదీ గత కొన్ని నెలల కిందట ఒక ప్రెస్ మీట్ లో పర్సంటేజ్ పంచాయితీలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ చేసిన కామెంట్స్.అసలే థియేటర్ వ్యవస్థ చచ్చిపోతుంటే,సింగిల్ థియేటర్లు మాయమైపోతుంటే,ఆడియన్స్ అసలు థియేటర్ల వైపు అడుగు వేయాలంటేనే ఆలోచిస్తుంటే ఇంకా టికెట్ రేట్లు పెంచమనడం లో అర్థం లేదని, మీడియా ముందు గగ్గోలు పెట్టారు.సరిగ్గా అది పెద్ది రిలీజ్ అయ్యే సమయం.

టికెట్ రేట్లు పెంచొద్దు అన్న శిరీష్ 

కట్ చేస్తే కాలం గిర్రున మూడు నెలలు తిరిగాయి.ఇపుడు టాక్సిక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో కాదు. ఆరోజు టికెట్ రేట్లు పెంచొద్దు అని ఏకరువు పెట్టుకున్న శిరీష్ బ్రదర్ దిల్ రాజు. కాని ఆ మాటలు ఈ సినిమాకి అసలు వర్తించవు ఉంటూ సింగిల్ స్క్రీన్‌లలో అదనంగా రూ.50, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ స్క్రీన్‌లలో అదనంగా రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నారు.

Advertisement

పైగా రోజుకు ఐదు షోలు దాదాపు పది రోజుల వరకు వేసుకునే అవకాశం కూడా వచ్చేసింది.ఇక్కడ బయటికి తెలంగాణా సర్కార్ నుండే వచ్చినట్టు కనిపించినా FDC చైర్మెన్ గా పని చేస్తున్న దిల్ రాజు ఈ డిసీషన్ వెనుక ఉన్నాడనేది కాదనలేని సత్యం.

మీకో ఒక న్యాయం,మిగతావారికి మరో న్యాయమా?

ఇదిగో దీన్నే పట్టేశారు నెటిజన్లు .అప్పుడు పెద్ది సినిమా సమయంలో అసలు అంతలా గగ్గోలు పెట్టి ఇపుడు రేట్లు పెంచుకోవడం ఏంటి …మీరు గనుక నిజంగా ఆడియన్స్ మంచి కోసం, థియేటర్ల బాగు కోసం ఆలోచించి ఉంటే మీరే టికెట్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ మీ సినిమాని మామూలు రేట్లకే అమ్మొచ్చు కదా ..కానీ అమ్మరు, మీ సినిమాలకైతే ఒక న్యాయం, మిగతావారి సినిమాలకి అయితే మరో న్యాయమా అంటూ సోషల్ మీడియాలో ఎకిపారేస్తున్నారు.పైగా మెగా ఫ్యామిలీ సినిమాల రిలీజ్ సమయంలోనే మీకు అన్నీ గుర్తుకు వస్తాయి అంటూ ట్విట్టర్ లో అప్పుడు మాట్లాడిన వీడియోని పెట్టి చెడుగుడు ఆడేస్తున్నారు .

టాలీవుడ్ కి పట్టిన చీడ పురుగులు

Advertisement

పైగా టాక్సిక్ అనేది కన్నడ హీరో సినిమా.అయినప్పటికీ మన హీరోల సినిమాల రిలీజ్ టైం లో హడావిడి చేసి యష్ లాంటి పొరుగు హీరో సినిమాకి ఇలా చేయడం అస్సలు బాగోలేదు.కేవలం మీరు ఈ సినిమాని కొన్నారన్న ఒక్క కారణంతో సొంత ప్రయోజనాల కోసం ఆడియన్స్ జేబులకి చిల్లులు పెట్టేందుకు సిద్దం అయిపోయారు. ఒక రకంగా దిల్ రాజు బ్రదర్స్ టాలీవుడ్ కి పట్టిన చీడ పురుగులు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

చూడాలి మరి డ్యూయల్ రోల్స్ వేస్తూ చెప్పిన మాటలకి, చేస్తున్న పనులకి పొంతన లేకుండా సాగిపోతున్న దిల్ రాజు బ్రదర్స్ ఈ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారో !

Tags

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×