Lalit Modi Fixing Allegations Against Srinivasan: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ (Lalit Modi) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న లలిత్ మోడీ… పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ప్రస్తావిస్తూ.. చాలా ఆరోపణలు చేస్తున్నారు. తారు ఉన్నప్పుడే ఐపీఎల్ బాగుండేదని… ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలతో పాటు ఫిక్సింగ్ జరుగుతోందని బాంబు పేల్చారు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓనర్ ఎన్. శ్రీనివాసన్ (N. Srinivasan ) కూడా ఐపీఎల్ లో అంపైర్ల ఫిక్సింగ్ ( Umpiring-Fixing Allegations ) పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేశారు.
బీసీసీఐ కార్యదర్శిగా ఎన్. శ్రీనివాసన్ (N. Srinivasan ) ఉన్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేలా కుట్రలకు తెరలేపాడని లలిత్ మోడీ షాకింగ్ ఆరోపణలు చేశారు. బిసిసిఐ కార్యదర్శి పదవిలో ఉండి తనకు నచ్చినట్లుగా అంపైర్లను మార్చేశాడని బాంబు పేల్చారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్ కు చెన్నై నగరానికి సంబంధించిన అంపైర్లను తీసుకు వచ్చి పెట్టేవాడని వివరించారు. దీంతో ఆ అంపైర్లు మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే వారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వేలం సందర్భంగా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ( Andrew Flintoff) ను సొంతం చేసేందుకు శ్రీనివాసన్ పెద్ద కుట్రకే తెరలేపాడని బాంబు పేల్చారు ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ (Lalit Modi). ఆండ్రూ ఫ్లింటాఫ్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసేలా మిగిలిన జట్లను బిడ్డింగ్ వేయవద్దని శ్రీనివాసన్ ఒత్తిడి చేశారని కూడా ఆరోపణలు చేశారు లలిత్ మోడీ.
శ్రీనివాసన్ సాగించిన ఈ అక్రమాలను తాను బయట పెట్టడానికి ప్రయత్నించడం కారణంగా… తనపై దుష్ప్రచారం చేశాడని ఫైర్ అయ్యారు. కుట్రలు చేసి బీసీసీఐ నుంచి తనను వెళ్లగొట్టి… అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను తాను ఎంతో కష్టపడి, తాను తెరపైకి తీసుకువచ్చానని గుర్తు చేశారు. తాను చైర్మన్ గా ఉన్నన్ని రోజులు టోర్నమెంట్ లో సజావుగా ముందుకు సాగించాలని తెలిపారు. ఫిక్సింగ్ చేయాలని పాకిస్తాన్ నుంచి కూడా ఒత్తిళ్లు తనకు వచ్చాయి… కానీ ఎక్కడ కూడా తల వంచలేదని వెల్లడించారు ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ (Lalit Modi). దీంతో లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.