E-Paper
Advertisement

Dil Raju: టాక్సిక్ తెలుగు రైట్స్ రూ.120 కోట్లు ఫేక్… దిల్ రాజు రియాక్షన్ ఇదే!

Dil Raju: టాక్సిక్ తెలుగు రైట్స్ రూ.120 కోట్లు ఫేక్… దిల్ రాజు రియాక్షన్ ఇదే!
Advertisement

Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు (Dil Raju) ప్రస్తుతం పలు సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు సినిమా రిలీజ్ హక్కులను కూడా దక్కించుకుంటూ పలు సినిమాలను విడుదల చేస్తూ భారీగా లాభాలను పొందుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాల నైజాం హక్కులను దక్కించుకొని భారీ లాభాలను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు త్వరలోనే విడుదల కాబోతున్న టాక్సిక్ (Toxic)సినిమా హక్కులను కూడా దక్కించుకున్నారు.

దిల్ రాజు చేతికి తెలుగు థియేట్రికల్ రైట్స్ ..

గీతు మోహన దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి అయింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా 120 కోట్ల రూపాయలు పెట్టినట్లు దిల్ రాజు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి.

రూ.120 కోట్ల కు టాక్సిక్ తెలుగు రైట్స్..

Advertisement

దిల్ రాజు ఈ సినిమా హక్కుల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయలేదని , ఈ వార్తలన్నీ కూడా ఫేక్ అంటూ కొంతమంది విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలపై తాజాగా దిల్ రాజు స్పందించారు. తాజాగా దిల్ రాజు మార్కండేయ సినిమా టైటిల్ గ్లింప్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి దిల్ రాజుకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీరు నిజంగానే 120 కోట్లు పెట్టి కొన్నారా అంటూ వార్తలు వస్తున్నాయి కదా వారికి మీరేం చెబుతారు అంటూ ప్రశ్న ఎదురవడంతో దిల్ రాజు ఘాటుగా స్పందించారు.

బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తా..

Advertisement

ఈ సినిమా హక్కులను నేను రూ.120 కోట్లు పెట్టి కొన్నా అనేది ఫేక్ అంటున్న వాళ్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక బ్యాక్ స్టేట్మెంట్స్ కూడా చూపిస్తాను అంటూ ఈయన తెలియజేశారు. ఇలా టాక్సిక్ సినిమా విషయంలో వస్తున్న వార్తలను దిల్ రాజు ఖండించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదివరకు సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ వీడియో భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. టాక్సిక్ సినిమాలో యష్ జోడీగా కియార అద్వానీ నటించారు. అదేవిధంగా తారా సుతారియ, రుక్మిణి వసంత్, నయనతార వంటి పలువురు ఈ ప్రాజెక్టులో భాగమైన సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ 2 సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read: Dil Raju: అల్లు అర్జున్ 42 రూల్స్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన దిల్ రాజు!

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×