India vs Namibia: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా, ఇవాళ నమీబియాతో ఫైట్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నమీబియా వర్సెస్ ఇండియా ( India vs Namibia) మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ( Arun Jaitley Stadium, Delhi ) మ్యాచ్ కూడా జరిగింది. ఇందులో కాస్ ఓడిపోయి ఇండియా బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడింది సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav) సేన. ఈ సందర్భంగా తొమ్మిది వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా జట్టు 209 పరుగులు సాధించింది. 300కు పైగా పరుగులు సాధించాలని కసితో దిగిన టీమిండియా నడ్డి విరిచింది నమీబియా. మొదటి నుంచి ఇండియాను కట్టడి చేసిన నమీబియా, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక ఈ మ్యాచ్ లో నమీబియా గెలవాలంటే 20 ఓవర్స్ లో 210 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఇండియా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందో చూడాలి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు ఆడింది ఇండియా. ఈ సందర్భంగా తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా 209 పరుగులు మాత్రమే సాధించింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి 120 పరుగులు సాధించిన ఇండియాను, నబిబియా అద్భుతంగా కట్టడి చేసింది. ముఖ్యంగా నమిబియా కెప్టెన్ ఎరాస్మాస్ నాలుగు ఓవర్లు సంధించి కేవలం 20 పరుగులు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇండియాకు చెందిన నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇండియా స్కోర్ 209 వద్ద మాత్రమే ఆగిపోయింది. 300 పైగా పరుగులు సాధిస్తాం అనుకున్న ఇండియా, నడ్డి నమీబియా విరిచింది. ఇషాన్ కిషన్ 61 పరుగులు సాధించగా హార్దిక్ పాండ్యా 52 పరుగులతో రాణించారు.
ఇండియా వర్సెస్ నమీబియా ( T20 World Cup 2026 tournament) మధ్య జరిగిన ఇవాల్టి మ్యాచ్ లో 19 వ ఓవర్ చాలా కీలకంగా మారింది. ఈ ఓవర్ నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ వేయడం జరిగింది. ఇందులో మొత్తం మూడు వికెట్లు కోల్పోయింది ఇండియా. ఇందులో రెండు వికెట్లు ఎరాస్మస్ తీశాడు. ఒకటి రనౌట్ అయింది. ఈ 19 వ ఓవర్ లో హర్ధిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్ కూడా ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా స్కోర్ తగ్గింది.
India have posted a mammoth total against Namibia 🇮🇳🏏
📸: JioHotstar #T20WorldCup2026 #INDvsNAM #HardikPandya #ShivamDube #CricketTwitter pic.twitter.com/9dKZ4Ag8R5
— InsideSport (@InsideSportIND) February 12, 2026