E-Paper
Advertisement

డబ్బు మనది.. పర్మిషన్ నెటిజన్లది, వైరల్‌ చైనా యాప్ కథేంటి?

డబ్బు మనది.. పర్మిషన్ నెటిజన్లది, వైరల్‌ చైనా యాప్ కథేంటి?
Advertisement

మీకు ఒక కొత్త ఫోన్ కొనాలని ఉంది. మీ దగ్గర డబ్బులున్నాయి. ఆ ఫోన్ కొనగలిగే స్థోమత కూడా ఉంది. షాప్‌కి వెళ్లారు. ఫోన్ సెలెక్ట్ చేసుకున్నారు. బిల్ కట్టబోతున్నారు. కానీ సరిగ్గా ఆ చివరి నిమిషంలో ఏం చేస్తారో తెలుసా? మీ ఫోన్‌లో ఒక యాప్ ఓపెన్ చేసి… మీరు కొనాలనుకుంటున్న ఫోన్ వివరాలు అందులో పెడతారు. ఆ తర్వాత ప్రపంచంలోని ఎక్కడో ఉన్న కొంతమంది సంబంధం లేని వ్యక్తులను ఒక ప్రశ్న అడుగుతారు. నేను ఈ ఫోన్ కొనొచ్చా? వద్దా? అని. వాళ్లు వద్దంటే.. నిజంగానే ఆ ఫోన్ కొనకుండా వెనక్కి వచ్చేస్తారు. వినడానికి వింతగా ఉంది కదా. కానీ చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ వైరల్ అవుతోంది. ఆ యాప్ పేరు… వాలెట్, ప్లీజ్ వెయిట్. అంటే వాలెట్ గారూ, కాస్త ఆగండి అని. ఈ యాప్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం.

నెటిజన్ల అభిప్రాయంతో కొనుగోలు

ఈ వాలెట్, ప్లీజ్ వెయిట్ అనే యాప్ ఇప్పుడు చైనాలో యమ ట్రెండింగ్ అవుతోంది. మీరు ఏదైనా కొనాలనుకుంటే ముందుగా ఆ వస్తువు పేరు, దాని ధర, ఎందుకు కొనాలనుకుంటున్నారు, దానికంటే తక్కువ ధరలో ఇంకేమైనా ఉన్నాయా లేదా… ఇలా అన్ని వివరాలు యాప్‌లో పోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్నెట్‌లోని ఇతర యూజర్లు మీ కొనుగోలుపై ఓటింగ్ చేస్తారు. కొనొచ్చు అని కొందరు… వద్దు అని మరికొందరు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. జస్ట్ ఓటు వేస్తే సరిపోదు. ఎందుకు దానికి రీజన్ కూడా చెప్పాలి. చివరికి వచ్చిన ఓట్ల ఆధారంగా ఒక ఫైనల్ తీర్పు వస్తుంది. అంటే మీ డబ్బు.. మీ అవసరం.. కానీ నిర్ణయం మాత్రం ఇంటర్నెట్‌ది అన్నమాట.

అవసరమా, కాదా అనేది ఈ యాప్ చెప్పేస్తుంది

Advertisement

ఇప్పుడు ఈ యాప్‌కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఒక యూజర్ 150 యువాన్లు అంటే దాదాపు 2 వేల రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ కొనాలనుకున్నాడు. దానికి నెటిజన్లు ఓకే చెప్పారు. ఎందుకంటే చలికాలం వస్తోంది, ఇది అవసరమైన వస్తువే కాబట్టి కొనొచ్చన్నారు. మరో యూజర్ 4,500 యువాన్లు అంటే దాదాపు 60 వేల రూపాయలు పెట్టి ఐప్యాడ్ కొనాలనుకున్నాడు. ఈ ఐప్యాడ్ ఎందుకు అంటే.. ఆఫీసులో వీడియోలు చూడటానికి అని చెప్పాడు. అంతే… దానికి ఇంటర్నెట్ ఒప్పుకోలేదు. ఐప్యాడ్ అవసరం లేదు అనే జడ్జ్‌మెంట్ వచ్చేసింది.

ఖర్చులు తగ్గించేందుకు ఇదో చక్కని మార్గం

ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. మనకు ఏది అవసరమో.. ఏది అవసరం లేదో.. ఎవరో జడ్జ్‌ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది. నిజానికి ఈ యాప్ వైరల్ కావడం వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. అదేంటంటే.. మనం ఈ మధ్య డబ్బును చాలా ఈజీగా ఖర్చు పెట్టెస్తున్నాం. అంటే దేనికి అనేది కూడా ఆలోచించడం మర్చిపోతున్నాం. ఒకప్పుడు ఏదైనా కొనాలంటే మన జేబులో నుంచి డబ్బులు తీయాలి. వాటిని లెక్కపెట్టాలి. ఎదుటివాళ్ల చేతిలో పెట్టాలి. అంటే మన డబ్బు మన చేతుల్లో నుంచి వెళ్లిపోతోందనే విషయం మనకు క్లారిటీ ఉండేది.

Advertisement

కానీ ఇప్పుడు.. ఫోన్ తీసి స్కాన్ చేయాలి. పిన్ ఎంటర్ చేయాలి. పేమెంట్ సక్సెస్.. అంతే. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎంత ఖర్చయింది? మనం నిజంగా ఆ వస్తువు కొనాల్సిన అవసరం ఉందా? అనే ఆలోచనకు కూడా పెద్దగా అవకాశం ఉండటం లేదు. దీన్నే సైకాలజీలో పెయిన్ ఆఫ్ పేయింగ్ అంటారు. అంటే డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు మనకు కలిగే మానసిక ఇబ్బంది అన్నమాట. క్యాష్ రూపంలో పేమెంట్ చేసినప్పుడు ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్‌లో అలా ఉండదు. ఎందుకంటే డబ్బు మన చేతుల్లో నుంచి వెళ్లిపోవడం మనకు కనిపించదు. కేవలం స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ మాత్రమే కనిపిస్తుంది.

ఇన్‌స్టాంట్ గ్రాఫిటీతో జేబుకు చెల్లు

చైనాలో కాదు.. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. యూపీఐ, క్యూఆర్ కోడ్స్ వచ్చాక టీ షాప్‌లో పది రూపాయలు చెల్లించడం నుంచి షాపింగ్ మాల్స్‌లో వేల రూపాయలు ఖర్చు చేయడం వరకు.. ప్రతిదీ సెకన్లలో జరిగిపోతోంది. ఈ సిస్టమ్‌ మన డెయిలీ లైఫ్‌ను చాలా సింప్లిఫై చేసింది. బట్.. అదే టైమ్‌లో.. ఆలోచించకుండా ఖర్చు పెట్టే అవకాశాలను కూడా పెంచింది. ఇక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్లాష్ సేల్స్.. లిమిటెడ్ టైమ్ ఆఫర్స్… కౌంట్‌డౌన్ టైమర్స్.. బై వన్ గెట్ వన్.. ఇంకో వంద రూపాయలు ఖర్చు చేస్తే ఫ్రీ డెలివరీ.. ఇలా చాలా మెసేజేస్ మనల్ని టెంప్ట్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడే కొనండి… తర్వాత ఆలోచించండి అని. ఇది కూడా ఒక సైకాలజీ. దీనినే ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ అంటారు.

మనల్ని కంట్రోల్ చేయడానికి.. ఇలాంటి యాప్స్ అవసరం

మనకు ఒక వస్తువు నచ్చగానే దాన్ని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. ఆ వస్తువు మనకు ఇచ్చే ఆనందం ఇప్పుడే కావాలి అనిపిస్తుంది. కానీ డబ్బును సేవ్ చేయాలంటే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచించాలి. ఈరోజు వచ్చే ఆనందాన్ని వదులుకుని.. భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం డబ్బును దాచుకోవాలి. దీన్నే డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అంటారు. కానీ మన చుట్టూ ఉన్న షాపింగ్ ప్రపంచం మొత్తం మనల్ని వెంటనే కొనమని ఎంకరేజ్ చేస్తుంటుంది.. అలాంటి టైమ్‌లో ఆగి ఆలోచించాలని చాలా మందికి అనిపించడం లేదు. అప్పుడే వాలెట్, ప్లీజ్ వెయిట్ లాంటి యాప్స్‌ ఉపయోగపడతాయి.

ముక్కు ముఖం తెలియనివారి సలహా పాటించాలా?

ఈ యాప్ మీకు తెలియకుండానే ఒక పని చేస్తోంది. అదేంటంటే.. మీ కొనుగోలుకు, మీ కోరికకు మధ్యలో ఒక చిన్న బ్రేక్ వేస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్‌ క్వశ్చన్ ఉంది. అసలు మనం కష్టపడి సంపాదించిన డబ్బును మనం ఖర్చు పెట్టుకోవడానికి ముక్కుమొఖం తెలియని వాళ్ల పర్మిషన్ తీసుకోవడం ఏంటని.. ?

Also Read: చంద్రుడి దూళితో ఇటుకలు.. సిమెంట్ అవసరం లేదట, ఎలా నిర్మిస్తారంటే?

మీకు కూడా అదే అనిపించింది కదా. ఎందుకంటే ఒకరికి ఐప్యాడ్ అవసరం లేకపోవచ్చు. కానీ మరొకరికి అదే ఐప్యాడ్ పని కోసం అవసరం కావచ్చు. ఒకరికి ఖరీదైన షూస్ అనవసరమైన ఖర్చు కావచ్చు. ఇంకొకరికి అవి ఎన్నో రోజుల కల కావచ్చు. మన ఆర్థిక పరిస్థితి, మన అవసరాలు, మన ప్రాధాన్యతలు.. ఇవన్నీ మనకే తెలుసు. ఇంటర్నెట్‌లో ఓటు వేసే ప్రతి ఒక్కరికీ కాదు. కాబట్టి ప్రతి కొనుగోలుకూ నలుగురి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి వస్తువు కొనేముందు మనల్ని మనకు మనం ఒక ప్రశ్న మాత్రం వేసుకోవాలి. నాకు ఈ వస్తువు నిజంగా అవసరమా? లేక ఈ క్షణంలో కొనాలనిపిస్తోందా? అని. దానికి ఆన్సర్‌ తెలిస్తే చాలు మీకు ఏ యాప్‌ అవసరం లేదు.. ఎవరి ఓటింగ్‌తో పని లేదు. ఎందుకంటే మన వాలెట్‌కు నిజంగా కావాల్సింది.. ఇంటర్నెట్ పర్మిషన్ కాదు. మన ఆలోచనకు ఒక చిన్న బ్రేక్ మాత్రమే.

(గమనిక: ఇమేజ్‌ను చాట్ జీపీటీ ద్వారా క్రియేట్ చేశాం. గమనించగలరు.)

Tags

Related News

జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!

BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

రూ.749కే ‘హామర్ వేవ్’బ్లూటూత్ స్పీకర్..ఫీచర్లు చూస్తే అస్సలు వదలరు!

రూ.999కే 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో..ఇయర్ బడ్స్,డోంట్ మిస్

తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!

బిగ్,బోల్డ్ డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ లాంచ్..పూర్తి ఫీచర్లివే!

Big Stories

Advertisement
×