varsha bollamma: ప్రస్తుత జనరేషన్ యూత్ లో కొందరు క్యూట్ హీరోయిన్స్ కి పెద్దగా సినిమా ఆఫర్స్ తో సంబంధం లేకుండా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి హీరోయిన్స్ లో కన్నడ యంగ్ బ్యూటీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు డైహార్డ్ ఫ్యాన్ వర్ష బొల్లమ్మ కూడా ఒకరు. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో బాగా ఫేమస్. ఈ యంగ్ బ్యూటీ తమిళ్ లో “బిగిల్” అనే సినిమాలో కీలకపాత్ర పోషించింది.
Also Read: Suryakumar Yadav: సూర్యకు ప్రమాదకరమైన వ్యాధి… టీమిండియా కెప్టెన్ గా సర్పంచ్ సాబ్
ఇక తెలుగులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన మిడిల్ క్లాస్ మెలోడీస్, సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవకోన సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. అలా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది. 2019లో చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత వెట్రివేలన్, ఇవన్ యారేంద్రు తిరికిరత, యానుమ్ తీయవన్, కళ్యాణం, మందారం, సీమతురై, పెట్టికడై, సూతరక్కరణ్, విజిల్, చూసి చూడంగానే, మిడిల్ క్లాస్ మెలోడీస్, జాను, మానే నెంబర్ 13, పుష్పక విమానం, సెల్ఫీ, అక్క కొరివి స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం, ఊరు పేరు భైరవకోన వంటీ సినిమాల్లో నటించి విపరీతంగా ఆకట్టుకుంది.
పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేయనప్పటికీ.. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది వర్ష బొల్లమ్మ. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమెకి టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని, కోహ్లీ తన అభిమాన క్రికెటర్ అని చాలాసార్లు తెలిపింది. కోహ్లీ ఐపిఎల్ టైటిల్ అందుకోవడం తన కల అని గతంలో తెలిపింది.
“కోహ్లీ నా అభిమాన క్రికెటర్. అతడి కోసమే నేను ఐపీఎల్ చూడడం మొదలుపెట్టాను. విరాట్ కోహ్లీ ఐపిఎల్ టైటిల్ అందుకోవడం నా కళ. ఈసారి ఆర్సిబి టైటిల్ గెలుస్తుంది” అని గతంలో చెప్పుకొచ్చింది. ఆమె కోరుకున్నట్లుగానే ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచింది. ఈమె కన్నడ అమ్మాయి కావడంతో తన హోమ్ ఐపిఎల్ జట్టు బెంగళూరుకి వీరాభిమాని.
ఈ నేపథ్యంలో తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వర్ష ఆర్సిబి జెర్సీ ధరించి క్రికెట్ ఆడింది. ఈ వీడియోకి ” ఒకే ఒక నియమం.. నేను అవుట్ అని చెప్పే వరకు నేను అవుట్ కాదు, వర్ష అవుట్ కాదు అమ్మ” అని రాసుకు వచ్చింది. చివర్లో తమ్ముడు మూవీ ప్రమోషన్ కోసం అని మెన్షన్ చేసింది. దీంతో ఈ వీడియోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు ఆర్సిబి అభిమానులు.
Also Read: Rishabh pant: రిషబ్ పంత్ కు టైట్ హగ్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్?
టాలీవుడ్ హీరోయిన్ ఆర్సిబి జట్టులోకి వచ్చేసిందని.. వచ్చే ఐపీఎల్ లోను కప్ ఆర్సిబిదేనిని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన తమ్ముడు సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, లయ, వర్షా బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూలై 4న విడుదల కాబోతోంది.
?utm_source=ig_web_copy_link