BigTV English

Dil Raju: ఇండస్ట్రీ వరెస్ట్ స్టేజ్‌లోకి వెళ్తుంది… మూసుకోవాల్సిందే అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్

Dil Raju: ఇండస్ట్రీ వరెస్ట్ స్టేజ్‌లోకి వెళ్తుంది… మూసుకోవాల్సిందే అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్

Dil Raju: ఒకప్పుడు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆ సినిమాలను చూసి ఎంతో అనుభూతి చెందెవారు. ఒకప్పుడు టెలివిజన్లు లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తూ సినిమా ఇండస్ట్రీని ఎంతగానో ప్రోత్సహించారు. ఇక ఇటీవల కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ మనకు కొత్త సినిమాలను చూసే వెసులు బాటు ఉన్న నేపథ్యంలో చాలా మంది థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక సినిమా ఫస్ట్ షో పడగానే కొంతమంది సినిమాపై బురద చల్లుతూ నెగిటివ్ ప్రచారం చేస్తే కనుక ఆ సినిమా పరిస్థితి అక్కడితో క్లోజ్ అయిందని చెప్పాలి.


ఇక ఇటీవల కాలంలో ఓటీటీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. థియేటర్లో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇలా క్రమక్రమంగా థియేటర్లకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ ప్రస్తుతం వరస్ట్ స్టేజ్ లో ఉందని, ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే థియేటర్లన్నీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వేసవి మొత్తం ఖాళీ…


దిల్ రాజు నిర్మాణ సంస్థలో నితిన్(Nithin) హీరోగా నటించిన తమ్ముడు(Thammudu) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా దిల్ రాజుకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ఎంతో మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేస్తుంటారు అయితే ఈ వేసవి సెలవుల ఒక్క సినిమా లేకపోవడంతో థియేటర్లని వెలవెలబోయాయి. ఈ సమ్మర్ ను ప్రొడ్యూసర్లు ఎందుకని ఉపయోగించుకోలేదు అంటూ దిల్ రాజుకు ప్రశ్న ఎదురయింది.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి…

ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ సినిమా విడుదల అనేది నిర్మాతల చేతిలో లేదని ఓటీటీ సంస్థల చేతులలోకి వెళ్లిపోయిందని తెలిపారు. తమ్ముడు సినిమా ఎప్పుడో రెడీ అయింది కానీ ఓటీటీ వాడు ఎప్పుడు డేట్ అడుగుతున్నారు దాన్నిబట్టి సినిమా విడుదల చేయాల్సి ఉంది. తమ్ముడు సినిమా అనే కాదు ఇప్పుడు విడుదలయ్య సినిమాల రిలీజ్ తేదీలన్నీ కూడా ఓటీటీ విడుదల తేదీ మీదే ఆధారపడ్డాయని దిల్ రాజు తెలిపారు. స్టార్ ప్రొడ్యూసర్లకే ఇలాంటి సమస్యలు ఎందుకు? అంటూ మరో ప్రశ్న ఎదురయింది. ఫుట్ ఫాల్ పెంచుకోకపోతే ఇండస్ట్రీ వరస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతుందని దిల్ రాజు తెలిపారు.

ఒక్క సినిమా గురించి ఆలోచించను…

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలగాలి అంటే అక్కడ టికెట్లు రేట్లు తగ్గించాలి, ఫుడ్ రేట్లు తగ్గించాలి, అలాగే వారికి అనుగుణంగా థియేటర్లు ఉండాలి. ఇవన్నీ ఉన్న కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రారు. మంచి కంటెంట్ తో ప్రతి హీరో వరుస సినిమాలు చేస్తూ ప్రతివారం ఏదో ఒక సినిమాని విడుదల చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీ బ్రతుకుతుందని, లేదంటే వరెస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుందని తెలిపారు. నిర్మాతలు అందరూ కూర్చొని ఓటీటీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు కదా? అనే ప్రశ్నకు అలా కుదరదని, నేను నా సినిమా వరకు మాత్రమే ఆలోచిస్తాను పక్క సినిమాల గురించి ఆలోచించే అంత పెద్ద మనసు ప్రొడ్యూసర్లకు ఉండదు అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related News

Monica Bellucci : మోనికా పాటపై మోనికా బెల్లూచి రియాక్షన్

Coolie & War2 : ఇదెక్కడి దారుణం, చెన్నై కంటే హైదరాబాద్ లో హైయెస్ట్ టికెట్ రేట్లు

Nidhi Agarwal Car Issue : నిధి అగర్వాల్ కారు కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్ ఇదే

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్

Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..

Big Stories

×