BigTV English

Nuts In Diet: నట్స్ తింటే బరువు పెరుగుతారా ? ఇందులో.. నిజమెంత ?

Nuts In Diet: నట్స్ తింటే బరువు పెరుగుతారా ? ఇందులో.. నిజమెంత ?

Nuts In Diet: బాదం, వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు వంటి గింజలు ఎంత రుచికరమైనవో మనందరికీ తెలుసు. అవి రుచికరమైనవి మాత్రమే కాదు. అనేక పోషకాలకు నిధి వంటివి. ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని ‘సూపర్‌ఫుడ్‌లు’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.


కానీ.. మనలో చాలా మంది నట్స్ తినడం వల్ల బరువు పెరుగుతుందనే అపోహ ఉంటుంది. ఈ భయం కారణంగా.. మనలో కొందరు వాటిని ఆహారంలో చేర్చుకోవడానికి వెనకాడతారు. కానీ ఇది పూర్తిగా నిజమేనా ? నట్స్ బరువుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి ? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నట్స్ బరువు పెంచుతాయా ?
నట్స్‌లో అధిక కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల తింటే.. బరువు పెరుగుతామని అనుకుంటారు. అయితే, పరిమిత పరిమాణంలో నట్స్ తినడం వల్ల బరువు పెరగదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నట్స్‌లో ఉండే మోనో శాచురేటెడ్, పాలీ అన్‌ శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా మీరు తక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. రోజూ 20-30 గ్రాముల నట్స్ తినే వ్యక్తులు బరువు పెరిగే అవకాశం తక్కువ. వేయించిన నట్స్ అదనపు కేలరీలను కలిగి ఉంటాయి కాబట్టి, ఉప్పు లేకుండా లేదా నూనెలో వేయించకుండా నట్స్ తినడం ఉత్తమం. ఇప్పుడు మీరు మీ ఆహారంలో ఎలాంటి నట్స్ తినాలో తెలుసుకుందాం.


బాదం:
బాదం విటమిన్ E, మెగ్నీషియం, ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఇవి గుండె ఆరోగ్యం, చర్మం, రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్, ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా అతిగా తినాలనే కోరికను తగ్గిస్తాయి. బాదం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

Also Read: ఈ 3 రోజ్ వాటర్‌లో కలిపి వాడితే.. ఫేస్ క్రీముల అవసరం ఉండదు

పిస్తా:

పిస్తాపప్పులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు నియంత్రణకు చాలా బాగా ఉపయోగపడతాయి. పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. పిస్తా తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. మధ్యాహ్నం స్నాక్‌గా లేదా స్మూతీలో కలిపి కూడా వీటిని తినవచ్చు.

వాల్‌నట్స్:
వాల్‌ నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్ బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిని తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. వాల్‌నట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ప్రభావ వంతంగా ఉంటాయి. వాల్‌నట్‌లను ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో తింటే.. అది మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే వాల్ నట్స్ తినడం చాలా మంచిది.

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×