Diljit Controversy: దిల్జిత్ దోసాంజ్…ఈపేరిప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్.ఒక వైపు సట్లేజ్ సినిమా ఓటీటీలో వదిలిన 48 గంటల్లోనే బ్యాన్ అవడం ఒకవైపు అయితే, దిల్జిత్ అమెరికా పౌరసత్వం (యూఎస్ సిటిజన్‌షిప్) చుట్టూ జరుగుతున్న రచ్చ మరోవైపు.ఈ రెండు ఇష్యూస్ ఇపుడు దిల్జిత్ ని మీడియాలో తెగ హైలెట్ చేస్తున్నాయ్.
ముందుగా దిల్జిత్ పౌరసత్వం విషయానికి వస్తే దిల్జిత్ 2022 లోనే సీక్రెట్ గా అమెరికా సిటిజన్ షిప్ పొందాడని ,ఇక ఇండియా ఎప్పుడు వచ్చినా ఈ వీసా ద్వారానే వస్తున్నాడన్న రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి.ఇక ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూలో అభిమాని ఈ గ్రీన్ కార్డ్ గురించి క్వశ్చన్ వేయగా అవును ..మార్కెట్లో దొరికిన ఒక కార్డ్ తీసుకొని దానికి గ్రీన్ కలర్ వేసుకున్నాను.అదే గ్రీన్ కార్డ్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ వేశాడు దిల్జిత్.అయితే ఈ కాంట్రవర్సీపై ఏం మాట్లాడినా అది ఇంకా పెద్దదిగా మారుతుందని, సర్క్యులేట్ అయ్యే రూమర్స్ కి అసలెక్కడ ఎండ్ కార్డ్ వేయలేమని చెప్పుకొచ్చాడు .ఇక ఇదే క్రమంలో వీసాలు, సరిహద్దులు లేని ప్రపంచం ఉంటే బాగుంటుందనేది తన అభిప్రాయమని చెప్తూ కాంట్రవర్సీకి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
ఇక ఇదిలా ఉంటె గతకొన్ని రోజులుగా దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సట్లెజ్’చుట్టూ జరుగుతున్న జరుగుతున్న రచ్చ అంతా ఇంతాకాదు.ఈ సినిమా జూలై 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో సైలెంట్‌గా విడుదలై, అంతే సైలెంట్‌గా రెండు రోజులకే డిలీట్ కావడం ఫిలిం వర్గాల్లో సంచలనం స్ప్రుష్టించిన సంగతి తెల్సిందే.
1984 నుండి 94 మధ్యకాలంలో పంజాబ్లో జరిగిన తీవ్రవాద అణిచివేతల నేపథ్యంలో వేలాదిమంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ దారుణ నిజాలను బయటపెట్టి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లిన మానవ హక్కుల ఉద్యమకారుడు జశ్వంత్ సింగ్ కల్రా నిజజీవిత ఆధారంగా డైరెక్టర్ హనీ డెహ్రాన్ ఈ సినిమాని తెరకెక్కించాడు .1990లో ఖల్రా కూడా రహస్యంగా అదృశ్యమై ఆ తర్వాత హత్యకు గురైనట్లు తేలడం పంచాయతీ చరిత్రలోనే ఒక బ్లాక్ చాప్టర్ .
ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ ని టచ్ చేయడంతోనే ఈ సినిమా మొదటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది .వాస్తవానికి ఈ సినిమా జర్నీ అంత ఈజీగా సాగలేదు .మొదట ఈ సినిమాకి ‘ఘల్లుఘారా’ (Ghallughara)అనే హిస్టారికల్ టైటిల్ ని పెట్టారు మేకర్స్ .అయితే దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో పాటు 21 కట్స్ విధించింది.
also read:‘లెనిన్’ లో అఖిల్ బ్లైండ్ క్యారెక్టర్? …. అయ్యగారి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడేనా?
దీంతో మేకర్స్ కోర్ట్ మెట్లు ఎక్కడంతో టైటిల్ పంజాబ్ 95 గా మార్చారు.20 23లో ద ఫేమస్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రీమియర్ వేయాల్సినప్పటికీ అనేక పొలిటికల్ ప్రెజర్స్ వల్ల చివరి నిమిషాల్లో సినిమా స్క్రీనింగ్ రద్దు చేశారు.ఇలా థియేటర్లో రిలీజ్ దాదాపు అసాధ్యం కావడంతో ఇక ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా అన్ కట్ వెర్షన్ ని Zee5 లోవదిలారు మేకర్స్ అయితే సినిమా రిలీజ్ సమయంలోనే దీనిపై బ్యాన్ చేసే అవకాశం ఉందని హీరో దిల్జీత్ దోసాంజ్ ముందే ఊహించారు. జులై 3న ఆయన ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి సోమవారానికల్లా జూలై 6 20 26 కల్లా ఈ సినిమాను తీసేసి ప్రమాదం ఉందని కాబట్టి ఆడియన్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని హింట్ కూడా ఇచ్చాడు .అయితే ఆయన భయపడినట్టుగానే ఆదివారంZee5 ఇండియాలో లింకులు నిలిపివేసింది.
ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇక్కడ స్ట్రీమింగ్ కష్టమని అయితే విదేశాల్లో ఉండే Zee5 గ్లోబల్ ద్వారా అందుబాటులో ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది Zee5. దిల్జీత్ పంజాబీ లో ఎమోషన్ అవుతూ చేసే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి .నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా, చనిపోయే వరకు తాను పంజాబ్ హకుల కోసమే పోరాడుతానని కుండబద్దలు కొట్టేశాడు.ఇక సినిమా ఇప్పటికి ఇంటర్నెట్లోకి వచ్చేసిందని, డౌన్ లోడ్ చేసుకొని అయినా సరే ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరాడు.జస్వంత్ సింగ్ కల్రా చేసిన త్యాగం గురించి దేశంలోని ప్రతి ఇంట్లో చర్చి జరగాలని తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
గతంలో పంజాబ్లో నేపథ్యంలో వచ్చిన పంజాబ్ 1984, ఉడ్తా పంజాబ్’వంటి సినిమాలు ఇలాంటి కాంట్రవర్సీలనే ఫేస్ చేసినప్పటికీ ‘‘సట్లెజ్ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ 48 గంటల హైడ్రామా మాత్రం సినీ ఇండస్ట్రీలో ఒక రికార్డు అని చెప్పక తప్పదు .