E-Paper
Advertisement

ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!

ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!
Advertisement

Dangerous Apps: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయింది. అయితే మనం డౌన్‌లోడ్ చేసుకునే అన్ని యాప్స్ సురక్షితమైనవి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని యాప్స్ వల్ల మనకు తెలియకుండానే కొంప మునిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇంతకీ ఫోన్ లో ఉండకూడని యాప్స్ ఏవి? వాటిని వెంటనే డిలీట్ చేయకపోతే ఏం జరుగుతుంది? వాటివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆర్థిక నష్టపోయే ప్రమాదం

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఎదురయ్యే అతిపెద్ద ముప్పు ఆర్థిక నష్టం. కొన్ని థర్డ్ పార్టీ లోన్ యాప్స్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్, అనధికారిక గేమింగ్ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలు చుట్టు ముట్టే ప్రమాదముంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ కాకుండా ఇంటర్నెట్ లో దొరికే ఏపీకే (APK) ఫైల్స్ ద్వారా ఎటువంటి ఆర్థిక లావాదేవీల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను, బ్యాంకింగ్ ఓటీపీలను దొంగిలించి మీకు తెలియకుండానే ఖాతాలో ఉన్న డబ్బును కాజేస్తాయని హెచ్చరిస్తున్నారు.

వ్యక్తిగత సమాచారానికి తీవ్ర ముప్పు

Advertisement

ఫోన్‌లో దాచుకునే ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, సందేశాలకు ఎంతో విలువైనవి. కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు అవసరం లేకపోయినా ఫోన్ గ్యాలరీ, లొకేషన్, మైక్రోఫోన్ పర్మిషన్లు అడుగుతుంటాయి. ఉదాహరణకు ఒక సాధారణ ఫ్లాష్ లైట్ యాప్ లేదా ఫోటో ఎడిటింగ్ యాప్‌కు మీ కాంటాక్ట్ లిస్ట్ లేదా లొకేషన్ పర్మిషన్ అవసరం లేదు. అలాంటి యాప్స్ మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి, డార్క్ వెబ్‌లో అమ్ముకోవడమే కాకుండా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

వ్యసనంగా మారే ప్రమాదం

కొన్ని యాప్స్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. చివరికి అవి లేకపోతే ఉండలేము అనేలా (వ్యసనంగా) మారుస్తాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్, మితిమీరిన రీల్స్/షార్ట్స్ చూసే యాప్స్ ఈ జాబితాలోకి వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి యూజర్ల సైకాలజీతో ఆడుకుంటాయని ఎక్కువ సమయం యాప్‌లోనే గడిపేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా సమయం వృథా అవుతుంది. విద్యార్థులు, యువత ఇలాంటి యాప్స్ వల్ల తమ చదువును, కెరీర్‌ను పాడు చేసుకునే ప్రమాదం ఉంది.

Advertisement

Also Read: నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!

వెంటనే డిలీట్ చేయండి!

ఫోన్ భద్రంగా ఉండాలంటే కొన్ని యాప్స్ ను తప్పనిసరిగా డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ వచ్చే నకిలీ యాప్స్, ఫోన్ స్పీడ్ పెంచుతామని చెప్పే థర్డ్-పార్టీ క్లీనర్ యాప్స్ చాలావరకు మాల్వేర్‌తో కూడి ఉంటాయి. మరోవైపు కొన్ని ఫేక్ డేటింగ్ యాప్స్.. వ్యక్తిగత వివరాలను సేకరించి బ్లాక్ మెయిలింగ్ పాల్పడే అవకాశముంది. కాబట్టి అలాంటి యాప్స్ తో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేయాల్సి వచ్చినా అధికారిక ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్ చేయాలని హితవు పలుకుతున్నారు.

Also Read: వాషింగ్ మిషన్ కొంటున్నారా? రూ. 30 వేలలో ఇవే బెస్ట్.. మొండి మరకలైనా మాయం కావాల్సిందే!

Related News

టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్

‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్

రూ.30 వేలలోపే 50 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

Big Stories

Advertisement
×