BigTV English

Dilraju: ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిపోయింది దిల్ మావా.. కంట్రోల్ చేయడం కష్టమే

Dilraju: ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిపోయింది దిల్ మావా.. కంట్రోల్ చేయడం కష్టమే

Dilraju: నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని ఒక సామెత ఉంది. ఈ సామెతను పాపం నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎలా ఉంది. ఒక్క మాట నార్మల్ గా మాట్లాడినా. దానికి పెడర్ధాలు తీసి.. నెగిటివిటీ సృష్టిస్తున్నారు. అలాంటింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ముందు వెనుకా ఆలోచించకుండానే నిందలు వేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ? సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇవ్వక ఇవ్వక ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే.. అందులో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా.. ? గేమ్ ఛేంజర్ ప్లాప్ అయ్యింది కాదనడం లేదు. ఆ ప్లాప్ కచ్చితంగా హీరో ఖాతాలోనే పడుతుంది.అది తెలిసి కూడా ఇంకా హీరోను ఆడిపోసుకోవడం అస్సలు బాగాలేదు.


 

ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ సినిమా తరువాత చరణ్.. దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో గేమ్ ఛేంజర్ ను ఓకే చేశాడు. అది ఎంత లేట్ అయినా కూడా వెనక్కి వెళ్లకుండా సినిమాను ఫినిష్ చేశాడు. ఒక స్టార్ హీరోగా అది అతను చేయాల్సిన అవసరం లేదు. కానీ, చేశాడు. బ్యాడ్ లక్ సినిమా హిట్ అవ్వలేదు. అయితే.. ప్లాప్ అయితే డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి ఫోన్ చేసిఓదార్చాలని రూల్ ఉందా.. ? డబ్బులు వెనక్కి ఇవ్వాలని రూల్ ఉందా.. ? ఇవ్వాలి అనుకున్నవారు ఇస్తారు. లేకపోతే మానేస్తారు. దాన్ని మనసులో పెట్టుకొని.. చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పడం తప్పు. చాలా నిర్మాణ సంస్థలు.. ఎన్నో ప్లాప్ సినిమాలను తీశాయి. వారందరూ డబ్బులు వెనక్కి ఇచ్చారా.. ? పోనీ హిట్ అయితే.. మీరేమైనా హీరోలకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా.. ? ఏదో చరణ్ పై విషం వెళ్ళగక్కాలని కాకపోతే అసలు అలా అనడం ఏంటి.. ? దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎవరు మాట్లాడింది లేదు.


 

వారు మాట్లాడకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ? ఏకిపారేస్తున్నారు. ఈ ఒక్క ఇంటర్వ్యూతో SVC బ్యానర్ మొత్తాన్ని రోడ్డున పడేశాడు శిరీష్. ఈ ఒక్క వివాదం దిల్ రాజుకు పెద్ద నష్టాన్నే తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక డ్యామేజ్ అయ్యింది అని తెలుసుకున్న దిల్ రాజు..దాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ” ఎప్పుడో జనవరిలో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ ను ఇప్పటికీ ఏదో ఒక చోట అడుగుతూ మీడియా, జర్నలిస్టులు చంపుకు తింటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అయ్యిపోయింది.. ఎక్కడకు వెళ్లినా గేమ్ ఛేంజర్  టాపిక్ తప్పితే ఇంకొక టాపిక్ లేదు.  ఇండస్ట్రీలో ఎన్నో ప్లాప్ సినిమాలు వచ్చాయి. వాటి గురించి మాట్లాడొచ్చు కదా. ఈ ఒక్క సినిమా గురించే ఎందుకు.? అన్ని ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చాలా ప్లాప్ అయ్యాయి. దేన్నీ ఇంతగా పట్టుకోలేదు. గేమ్ ఛేంజర్ .. దిల్ రాజు.

 

నిన్న మా శిరీష్ ను కూడా  ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తే అందులో కూడా అదే టాపిక్. అతను ఏదో అన్నాడని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అది అసలు అవసరం లేని టాపిక్. మేము తమ్ముడు ప్రమోషన్స్ కు వచ్చాం. దానికి సంబంధించి అడగొచ్చు కదా. చరణ్ కు నాకు మంచి అనుబంధం ఉంది.  ఒక మంచి హిట్ ఇవ్వలేకపోయా.. మంచి కథతో హిట్ ఇవ్వాల్సిందే అని  ఇంకో సినిమా అనౌన్స్ చేశా. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నాకు మంచి రిలేషన్ ఉంది. ఎక్కడా కూడా ఒక్క వివాదం లేకుండా వచ్చా. ఒక్క సినిమాప్లాప్ అయ్యింది. ఆ సినిమాను పట్టుకొని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. అయిపోయిన సినిమా గురించి ఇంత నెగిటివిటీ ఎందుకు ..? ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత చెప్పినా కూడా చరణ్ ఫ్యాన్స్ వినేలా కనిపించడం లేదు. దీంతో నెటిజన్స్ డ్యామేజ్  ఎక్కువ అయ్యింది .. కంట్రోల్ చేయడం కష్టమే దిల్ మావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Kaantha: దుల్కర్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూశారా.. ఇదేదో బాగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందే

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

Nagarjuna: కూలీ సినిమాతో పాటు ఆ బ్లాక్ బస్టర్ సినిమా ట్రైలర్, నాగార్జున మామూలు ప్లానింగ్ కాదు.

Aishwarya Rai: అత్యంత ధనవంతురాలిగా 2వ స్థానం.. ఐశ్వర్య ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

Big Stories

×