BigTV English

OTT Movie : దేవుడికి బదులు దెయ్యానికి పూజలు… ఇదెక్కడి దిక్కుమాలిన ఊరు భయ్యా ?

OTT Movie : దేవుడికి బదులు దెయ్యానికి పూజలు… ఇదెక్కడి దిక్కుమాలిన ఊరు భయ్యా ?

OTT Movie :  ఇప్పుడు సరికొత్త కంటెంట్ తో హారర్ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలకు కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ వంటి ఎలిమెంట్స్ ను జోడించి తెరకెక్కిస్తున్నారు మేకర్స్ . ఓటీటీలో ఈ సినిమలకు మంచి డిమాండ్ కూడా ఉంది. అందుకే ఈ జానర్ లో వచ్చే సినిమాలను పోటీ పడి సొంతం చేసుకోవడానికి ముందుకు వస్తుంటాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియన్ హారర్ సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ తో వచ్చింది. ఇందులో దెయ్యం, దేవుడి శక్తుల మధ్య సన్నివేశాలు నడుస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Thaghut’. 2024లో విడుదలైన ఈ సినిమాకి బాబీ ప్రసేత్యో దర్శకత్వం వహించారు. ఇందులో యాస్మిన్ నాపర్, అర్బాని యాసిజ్, రియా రిసిస్, వానీ ధర్మవాన్, డెన్నిస్ అధిస్వర, హనా సరస్వతి, కీను అజ్కా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ మొదట ‘Kiblat’ అనే టైటిల్‌తో ప్రకటించబడింది. కానీ వివాదాస్పద రీతిలో ఇస్లామిక్ టర్మ్‌ను ఉపయోగించడం వల్ల టైటిల్‌ను ‘Thaghut’గా మార్చారు. ‘Thaghut’ అనే పదం ఇస్లామ్‌లో అల్లాహ్ కాకుండా ఇతర దైవాలను ఆరాధించడానికి ఈ పదం వాడతారు. ఈ సినిమాకి IMDB లో 5.8/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఐనున్ అనే యువతి తన తండ్రి అబా గురించిన విషయాలను తెలుసుకుంటుంది. ఆమె చిన్నప్పటినుంచి తన బామ్మ దగ్గర పెరుగుతుంది. అబాకి ఒక గ్రామంలో ఆధ్యాత్మిక గురువుగా పేరు ఉంటుంది. అతను గ్రామస్థులకు సహాయం చేయడం, వ్యాధులను నయం చేయడం, ఆధ్యాత్మిక శక్తుల ద్వారా సమస్యలను పరిష్కరించడం వంటి పనులు చేస్తుంటాడు. అతను మీడియాలో కూడా పాపులర్ అవుతాడు. ఇప్పుడు ఐనున్ కూడా అతని సామర్థ్యాలను గొప్పగా ఆరాధిస్తుంది. అయితే ఐనున్‌ను పెంచిన అమ్మమ్మకు, ఆమె అబానిని ఆరాధించడాన్ని ఇష్టపడదు. ఎందుకంటే అతని గతం గురించి ఆమె బయపడుతుంటుంది. ఇంతలో ఆమె తండ్రి చనిపోయాడనే విషయం ఆమెకు తెలుస్తుంది. ఐనున్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి, అతని గ్రామానికి వెళ్తుంది.

అక్కడ ఆమె ఒక భయంకరమైన రహస్యాన్ని తెలుసుకుంటుంది. అబా ఆధ్యాత్మిక బోధనలు , దెయ్యం ఆరాధనతో సంబంధం కలిగి ఉన్నాయని ఐనున్‌కు తెలుస్తుంది. అ గ్రామంలో, ఐనున్, ఆమె స్నేహితుడు రహ్మత్ రాక్షస శక్తి ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఐనున్ ఈ శక్తులను ఎదిరించి, గ్రామస్థులను సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఒక స్థానిక మస్జిద్ దగ్గర ఒక వస్తువునుకనిపెడుతుంది. ఇది రాక్షస ఆచారాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ వస్తువు గ్రామంలో అనేక భయంకర సంఘటనలకు కారణమవుతుంది. ఐనున్ ఈ రాక్షస శక్తితో ఒక భీకరమైన యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇందుకు గానూ ఆమె తన తండ్రి బ్లాక్ మ్యాజిక్ ఆచారాలకు వ్యతిరేకంగా, ఆధ్యాత్మిక ఆచారాలను అనుసరిస్తుంది. ఆ తరువాత క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకు ఒక భయాంకరమైన అనుభవాన్ని ఇస్తుంది. చివరికి ఐనున్ ఈ దుష్ట శక్తిని అంతం చేస్తుందా ? ఆమె తండ్రి ఎలా చనిపోతాడు ? ఐనున్ తన తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : భర్తను నరికి, కూర వండి కుక్కలకేసే భార్య… అబ్బాయిల ఆశలపై మన్నుపోసే కథ

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×