Kavya Maran: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా SRH ఆడిన మ్యాచుల్లో గెలిచినా.. ఓడినా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ మీమ్స్ రూపంలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. క్రికెట్ పై నాకు ఉన్న మక్కువ వల్లే కెమెరామెన్ దృష్టిలో పడుతుంటా. హైదరాబాద్ లోనే కాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎక్కడ జరిగినా వెళ్తుంటాను. నేను దూరంగా కూర్చున్నా కూడా కెమెరామెన్ నా హావ భావాలను బంధించేందుకు ఆసక్తి చూపుతారు. అవి మీమ్స్ మారుతాయని చెప్పుకొచ్చారు కావ్య మారన్.
Also Read : Mohammed Siraj : సిరాజ్ హోటల్ లో హైదరాబాద్ ఫుడ్… ధరలు ఎలా ఉన్నాయంటే ?
కావ్య పాప పై మీమ్స్..
సాధారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి. మ్యాచ్ జరుగుతున్నంత సేపు SRH ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ లో ఆడినప్పుడు నేను ఏమి చేయలేను. నేను ఒక చోట కూర్చోవాలి. అహ్మదాబాద్, చెన్నైలకు కూడా నేను టీమ్ ని ఉత్సాహపరచడానికి వెళ్తుంటా. నేను ఎక్కడో దూరంలో కూర్చున్నా కెమెరామెన్ నా హావభావాలను బంధిస్తాడు. అందుకే అవి మీమ్స్ గా మారుతున్నాయి. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. డేవిడ్ వార్నర్ అద్భుతమైన కెప్టెన్సీ తో జట్టును విజేతగా నిలిపాడు. 2016 నుంచి మరో టైటిల్ గెలవలేదు. 2018, 2024 ఐపీఎల్ ఫైనల్ కి చేరుకున్నప్పటికీ విజేతగా నిలవలేదు. 2025 సీజన్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరిచింది. సీజన్ ప్రారంభంలో అలరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆపై వరుస పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది.
Also Read : Virat Kohli: వైట్ జెర్సీలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కమిన్స్ కెప్టెన్సీలో పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించిన SRH రెండో మ్యాచ్ నుంచి అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో విఫలం చెందింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో బ్యాటింగ్ లో కాస్త పర్వాలేదనిపించారు. వాళ్లు ఆడని మ్యాచ్ లో జట్టు ఓటమి పాలైంది. వాస్తవానికి ప్రారంభంలో విజయం.. చివర్లో విజయంతో ముగించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ముఖ్యంగా SRH జట్టు ఓటమి దిశలో ఉన్నప్పుడు కావ్య బాధలో ఉన్నా.. SRH జట్టు గెలిచే స్థితిలో.. ఫోర్, సిక్స్ కొట్టినప్పుడు కావ్య ఎగిరి గంతేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. మరోవైపు అదే సమయంలో కెమెరామెన్ కూడా ఆమెను ఫోకస్ చేయడంతో మ్యాచ్ కి ఆమె హైలెట్ కావడం విశేషం.