Kane Williamson Retirement: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ( KANE WILLIAMSON) సంచలన ప్రకటన చేశాడు. టీ20లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించాడు కేన్ మామ. 2011 సంవత్సరంలో టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన కేన్ మామ… దాదాపు 15 సంవత్సరాలు న్యూజిలాండ్ జట్టుకు సేవలు అందించాడు. అయితే అతని వయసు రీత్యా, టి20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు కేన్ విలియమ్‌సన్. ఇక కేన్ విలియమ్‌సన్ చేసిన తాజా ప్రకటనతో న్యూజిలాండ్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రేట్ లెజెండ్ శకం ముగిసిందని ఎమోషనల్ అవుతున్నారు కివీస్ ఫ్యాన్స్.
Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ మామ టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 సంవత్సరంలో టీ20లలో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, ఇప్పటి వరకు 93 టీ20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 2575 పరుగులు సాధించి దుమ్ము లేపాడు. ఇక ఇందులో 18 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు టి20 క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు కేన్ మామ. అతని అత్యధిక స్కోర్ కేవలం 95 పరుగులు మాత్రమే. అంతేకాదు, టీ20 క్రికెట్ లో 75 మ్యాచ్ లకు కేన్ మామ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే అతని వయసు మీద పడిన నేపథ్యంలో, న్యూజిలాండ్ తుది జట్టులో కూడా ఛాన్స్ ఎక్కువగా రావడం లేదు. టీ20లోకి ఎక్కువగా యంగ్ స్టార్లను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని కేన్ మామ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తాజాగా టీ20 లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్టు వెల్లడించాడు. కేన్ మామ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కోసం వేరే ప్లేయర్ ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకునే ఛాన్స్ ఉంది.
Also Read: Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫర్..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే
🚨 KANE WILLIAMSON ANNOUNCED HIS RETIREMENT FROM T20I INTERNATIONAL 🚨
– Thank You, Kane! 🙌 pic.twitter.com/385A2KxbAq
— Tanuj (@ImTanujSingh) November 2, 2025