Shekhar Kammula: కొంతమంది దర్శకులకి కొన్ని సినిమాల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళ బెస్ట్ వర్క్ అంటే ఆ సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఒక శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు అని కామెంట్స్ కూడా వస్తుంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు కూడా విపరీతమైన ఆదరణ లభించింది.
సినిమా తీస్తున్నప్పుడు అవగాహన లేదు
వాస్తవానికి సినిమాను మొదలు పెడుతున్నప్పుడు దర్శకుడు చాలా క్లారిటీగా ఉండాలి. తన కథ పైన తను తీయబోయే సీన్స్ పైన ఎంత క్లారిటీగా ఉంటే సినిమా అంత క్లీన్ గా వస్తుంది. లేకపోతే ప్రేక్షకులు అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఏం చెప్పాడు అంటూ కామెంట్ చేయడం మొదలుపెడతారు. ఒక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే తాను చదువుకున్న పది సంవత్సరాల తర్వాత ఒక కాలేజ్ స్టోరీ తీద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే తాను చదువుకొని దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాలేజ్ ఎలా ఉంది అని అతనికసలు అవగాహన లేదు. అందుకే ఏం చేశాడంటే తాను చదువుకున్న కాలేజీకి వెళ్లి ఊరికే పది రోజులు అలాగా తిరుగుతూ ఉండేవాడు. క్యాంటీన్, లైబ్రరీ తప్ప పెద్దగా మార్పులు ఏవి గమనించలేదు. అదే ఎమోషన్స్, అదే గోల, అదే రకమైన వాతావరణం వీటన్నిటిని చూసి శేఖర్ కమల హ్యాపీడేస్ మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు హ్యాపీ డేస్ తీస్తారా.?
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శేఖర్ కమ్ముల ఇప్పుడు హ్యాపీడేస్ తీస్తారా అని అడిగితే, ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు కిడ్స్ అంతా కూడా మారిపోయారు. జంజీ అనే ఒక కొత్త టర్మ్ కూడా వచ్చేసింది. అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు శేఖర్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే శేఖర్ కమ్ముల గతంలో ఎప్పుడూ మాట్లాడని విధంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ వచ్చారు. జూన్ 20వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ అంతా కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉంది.
Also Read : Anil Raavipudi: రామ్ వదిలేస్తే రవితేజ సినిమా చేసి హిట్ కొట్టాడా.?