Anil Raavipudi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నోసార్లు ఎన్నో సినిమాలు చేద్దామని కొంతమంది దర్శకులు అనుకుంటారు. ఈ హీరో తోనే చేద్దామని ఫిక్స్ అవుతూ ఉంటారు. కొంతకాలం పాటు వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటారు. అయితే చివరి నిమిషంలో ఆ సినిమాలు మిస్ అయిన సందర్భాలు ఉంటాయి. మొదటిలోనే మిస్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. పూరి జగన్నాథ్ చేసిన చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తారు అని పూరి నమ్మాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని కథలు బాగానే ఉన్నాయి అన్నారు కానీ ఏది ఓకే చేయలేదు. ఇక చిరంజీవితో పూరి జగన్నాథ్ కి సినిమా ఆగిపోయిన సందర్భాలు కూడా బోలెడున్నాయి. ప్రస్తుతం ఒక హీరోతో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆ సినిమాల క్యాన్సిల్ అయిపోతున్నాయి.
రామ్ చేయాల్సింది రవితేజ చేశారు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఒక ఫెయిల్యూర్ కూడా తీయలేదు. అయితే అనిల్ సినిమాల్లో చాలామందికి బాగా ఇష్టమైన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమాను మొదట రామ్ పోతినేనితో చేద్దామని అనిల్ ఫిక్స్ అయిపోయాడు. కథ కూడా రామ్ కి విపరీతంగా నచ్చింది. అయితే దాదాపు అదే కథతో రవితేజ సినిమా చేశాడు. చిన్న చిన్న మార్పులు మాత్రమే జరిపాడు. ఇక రామ్ ఎందుకు వదిలేసాడు అంటే బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేయటం కరెక్ట్ కాదు అనే ఆలోచనలో వదిలేసాడు. అయితే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత స్వయంగా రామ్ కాల్ చేసి అనిల్ రాయపూడిని అప్రిషియేట్ చేశాడు.
ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా
ఇక అనిల్ రావిపూడి జర్నీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో పనిచేసే అదృష్టం అనిల్ కు దక్కింది. అలానే విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పని చేయడమే కాకుండా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. స్వతహాగా మెగాస్టార్ చిరంజీవికి అనిల్ అభిమాని కావడంతో ఇప్పుడు రాబోయే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని అందరికీ ఒక రకమైన నమ్మకాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Manchu Vishnu: బన్నీ, రానా గ్రూప్ క్రియేట్ చేస్తే, మంచు విష్ణు ఎందుకు బయటకు వచ్చేసారు?