Brahmamudi serial today Episode: రాజ్, కావ్యతో మాట్లాడుతుంటే మధ్యలో యామిని వస్తుంది. సంగీత్‌కు టైం అవుతుంది వెళ్దాం పద బావ అంటుంది. రాజ్ ఇరిటేటింగ్‌గా ప్రతిసారి ఈ యామిని మధ్యలో వచ్చేస్తుంది. అని తిట్టుకుంటూ యామినితో వెళ్లబోతుంటే.. యామిని సారీ కళావతి గారు మీ నుంచి మా బావను తీసుకెళ్తున్నాను. ఐమీన్ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుంటే తీసుకెళ్తున్నాను. మీరు రండి సంగీత్ కి అని చెప్తుంది యామిని. ఎందుకు అని కావ్య అడగ్గానే.. నేను బావ డాన్స్ చేయడం మీరు చూడరా అంటూ రాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది యామిని. కావ్య కోపంగా తీసుకెళ్లు యామిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్లినా ఆయన తిరిగి నా దగ్గరకే వస్తారు. ఈ ఒక్కరాత్రికే తర్వాత శాశ్వతంగా ఆయన నీకు దూరం అవుతారు. అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు స్వప్న ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటే.. రాహుల్, రుద్రాణి ఎదురుగా వస్తారు. వాళ్లను చూసిన స్వప్న మీకోసం ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను. కానీ మీరు రాలేదు. ఇక మీరు వెళ్లిపోయారేమో అనుకుని నేను వచ్చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు రాలేదని అసలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లిపోయారు మీరు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి కోపంగా ఏయ్ ఓవరాక్షన్ చేసింది చాలు. చాలు ఆపు నీ నాటకాలు. మేము గదిలో స్ట్రక్ అయ్యేలా చేసింది నువ్వే అని మాకు తెలుసు అంటుంది. రాహుల్ కూడా కోపంగా అంతే కాదు. మమ్మల్ని ఈ పెళ్లికి రాకుండా అడ్డుకోవడానికి బయటి నుంచి గడియ పెట్టావని కూడా మాకు తెలుసు అని చెప్తాడు.
దీంతో స్వప్న నవ్వుతూ కంగ్రాచ్యులేషన్.. అంటూ ఇద్దరికీ షేక్‌హ్యాండ్ ఇస్తుంది. కంగ్రాచ్యులేషన్ ఎందుకే అంటూ రుద్రాణి కోపంగా అడుగుతుంది. దీంతో స్వప్న ఏడిసన్ బల్బును కనిపెట్టినట్టు, రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టినట్టు నేను ఘడియ పెట్టిన విషయం మీరు కనిపెట్టారు కదా అందుకు కంగ్రాచ్యులేషన్ చెప్పాను అంటుంది. దీంతో రుద్రాణి కోపంగా స్వప్నను కొట్టబోతుంటే.. రాహుల్ ఆపేసి మమ్మీ ఈ చుట్టూ మనుషులు ఉన్నారు వద్దు అంటూ ఆపేస్తాడు. నేను కూడా చుట్టు మనుసులు ఉన్నారని మిమ్మల్ని వదిలేస్తున్నాను అంటూ తిట్టి వెళ్లిపోతుంది స్వప్న.
అప్పు కోసం కనకం, ఇంద్రాదేవి అపర్ణ ఎదురుచూస్తుంటారు. ఇంతలో అప్పు వస్తుంది. అపర్ణ చూసి వచ్చేశారు అత్తయ్యా అని చెప్తుంది. ఇంద్రాదేవి ఏంటి అప్పు పని పూర్తి చేశావా ఇక ఏ సమస్య ఉండదు కదా అని అడుగుతుంది. దీంతో అప్పు ఏ సమస్య ఉండదు అమ్మమ్మగారు. ఈ అప్పు ఒక్కసారి చెప్పింది అంటే ఇంక ఏ తప్పు చేయదు. ఇక అంతా రెడీగా ఉంది. ఆ రఘు కాల్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్‌గా ఉంది అని చెప్తుండగానే రఘు ఫోన్ చేస్తాడు. మేడం మీరు చెప్పినట్టే వచ్చాను. బయట గార్డెన్‌లో వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. అయితే నువ్వు అక్కడే వెయిట్ చేయ్ నేను హింట్ ఇస్తాను కరెక్టుగా నువ్వు అప్పుడే యామినికి ఫోన్ చేయాలి. అలాగే నేను చెప్పిన ప్లేస్ గుర్తుంది కదా అక్కడే నువ్వు డబ్బులు తీసుకోవాలి అని చెప్పగానే.. మీరేం కంగారు పడకండి మేడం అంతా మీరు చెప్పినట్టే చేస్తాను అంటాడు రఘు. దీంతో అప్పు సరే అంటూ కాల్ కట్ చేస్తుంది.
అమ్మమ్మ గారు మీరేం టెన్షన్ పడకండి అంతా మన కంట్రోల్ లోనే ఉంది అని చెప్తుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత సంగీత్‌లో అందరూ ఒక్కొక్కరుగా స్టేజీ మీదకు వెళ్లి డాన్స్ చేస్తుంటారు. ప్రకాష్, ధాన్యలక్ష్మీ డాన్స్ చేయగానే.. కళ్యాణ్ వెళ్లి నాన్న మీరు సూపర్ అంటాడు. అరేయ్ ఇప్పుడు మీరు చేయాలిరా.. అంటూ కళ్యాణ్‌ను స్టేజీ మీదకు లాగేస్తాడు. ధాన్యలక్ష్మీ అప్పు నువ్వు రా.. రామ్మా అప్పు అంటూ స్టేజీ మీదకు అప్పును పంపిస్తుంది. ఇంతలో రఘు, యామినికి కాల్ చేస్తుంటాడు. యామిని ఇరిటేటింగ్‌గా వాళ్ల డాడీ దగ్గరకు వెళ్లి వాడు ఊరికే కాల్ చేస్తున్నాడు డబ్బులు ఎక్కడున్నాయి అని అడుగుతుంది. ఆయన డబ్బులు వస్తున్నాయి అమ్మా ఒక్క ఐదు నిమిషాలు అని చెప్తాడు. ఇంతలో అప్పు, కళ్యాణ్‌ల డాన్స్ అయిపోతుంది.
దీంతో ఇంద్రాదేవి నవ్వుతూ ప్రకాషం, ధాన్యం అయిపోయారు. అప్పు, కళ్యాణ్ కూడా అయిపోయారు. నెక్ట్స్ ఎవరు చేస్తారు…? ఆ రామ్ ఇంకా యామిని చేస్తారు అని చెప్తుంది. దీంతో యామిని షాక్ అవుతుంది. ఈ అమ్మమ్మ గారేంటి మమ్మల్ని చేయమంటున్నారు. నేను ఇప్పుడు డాన్స్ చేస్తూ ఉంటే వాడ లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు అందరి ముందు దొరికిపోతాను. ఇప్పుడు డాన్స్ చేయకుండా ఎలా తప్పించుకోవాలి అని మనసులో టెన్షన్ పడుతుంది. ఇంతలో అపర్ణ ఏంటి యామిని డాన్స్ చేయమంటే అలా సైలెంట్గా ఉంటావేంటి అని అడుగుతుంది.
ఇంతలో అప్పు కూడా అవును యామిని మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు కదా మీరు కలిసి డాన్స్ చేస్తే భలేగా ఉంటుంది అని చెప్తుంది. యామిని ఇరిటేటింగ్‌గా నేను తర్వాత చేస్తాను అని చెప్తుంది. అందరూ చెప్తున్నా కొంచెం అర్జెంట్ పనుంది వెళ్తున్నాను అంటూ యామిని బయటకు వెళ్తుంది. అందరూ నవ్వుకుంటారు. స్వప్న మాత్రం రామ్, యామిని డాన్స్ చేస్తారనుకుంటే పాపం యామిని వెళ్లిపోయింది. పాపం రామ్ ఒక్కడే ఎలా డాన్స్ చేస్తాడు అని అడుగుతుంది. దీంతో యామిని లేకపోతే ఏంటి నా మనవరాలు ఉంది కదా అంటూ కావ్య వద్దని వారిస్తున్నా వినకుండా బలవంతంగా అందరూ కలిసి రాజ్, కావ్య డాన్స్ చేసేలా చేస్తారు.
మరోవైపు యామిని వెళ్లి రఘుకు కోటి రూపాయలు తీసుకెళ్లి ఇస్తుంది. అదంతా చాటు నుంచి అప్పు, కళ్యాణ్ స్వప్న కలిసి వీడియో తీస్తారు. రఘు డబ్బులు తీసుకుని వెళ్లిపోగానే.. యామిని హమ్మయ్యా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. కావ్య ఎక్కడ వీడిని చూస్తుందోనని చాలా కంగారు వేసింది అనుకుంటుండగా.. కళ్యాణ్, అప్పు, స్వప్నలను చూస్తుంది. భయంతో వీళ్లెప్పుడు వచ్చారు అని ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అని వాళ్లు చెప్పగానే యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య, రాజ్ ఒంటరిగా ఉంటారు. ఇంతలో కావ్య ఏంటి రామ్ గారు ఏదో మాట్లాడాలని పిలిచి అలా సైలెంట్‌గా ఉన్నారేంటి అని అడుగుతుంది. దీంతో రాజ్ ఎమోషనల్ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?