KishkindPuri event :ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ లో కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ బీభత్సమైన హిట్ సినిమా అంటూ ఏమీ లేదు అనేది మాత్రం వాస్తవం. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దీనికి కారణం తన వ్యక్తిత్వం. ఏ రోజు కూడా ఒక్క మాట ఎక్కువగా మాట్లాడలేదు. ప్రతిసారి తనను తాను తగ్గించుకుంటూ జనాల దృష్టిలో మాత్రం ఎక్కువైపోయాడు. అందుకే తన సినిమా ఎలా ఉన్నా కూడా కొంతమంది చూడటానికి ఇష్టపడుతున్నారు.
అయితే ఇతని కెరియర్ లో రాక్షసుడు అనే సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా రీమేక్. మళ్లీ అదే హీరో హీరోయిన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కిష్కిందపురి. చావు కబురు చల్లగా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కౌశిక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి సర్కిల్ ఉంది. వాళ్ల నాన్న కూడా నిర్మాత కాబట్టి పెద్ద హీరోల సపోర్ట్ కూడా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొదటి సినిమానే దర్శకుడిగా వివి వినాయక్, హీరోయిన్ సమంత వంటి స్టార్ కాస్ట్ తో ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. కిష్కిందపురి సినిమాకు సంబంధించిన ఈవెంట్ రేపు సాయంత్రం హయత్ లో జరగనుంది.
దర్శకులు అనిల్ రావిపూడి, బాబి, బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాకి కథను అందించింది బాబి. ఈ ముగ్గురు దర్శకులు రేపు జరగబోయే ఈవెంట్ లో కనిపించనున్నారు. మరి వీళ్ళతో సాయి శ్రీనివాస్ కు ఎటువంటి అనుబంధం ఉంది అనేది రేపు వాళ్ళ మాటల్లోనే తెలిసే అవకాశం కూడా ఉంది.
వాస్తవానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి సినిమాను సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ముందు సెప్టెంబర్ ఐదున విడుదల చేస్తాము అని అనౌన్స్ చేసిన మిరాయి సినిమాను సెప్టెంబర్ 12 కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఆ తరుణంలో కిష్కిందపురి సినిమాను సెప్టెంబర్ 13 కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కూడా డిస్కషన్ చేశారు. ఈ డిస్కషన్ లోనే చిత్ర యూనిట్ కి తెలియకుండా పోస్టర్ కూడా బయటికి వచ్చింది. కానీ ఫైనల్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 12 కి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద సెప్టెంబర్ 12న ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
Also Read: Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?