Megastar Chiranjeevi : కొంతమంది హీరోలు కొన్ని సినిమాల్లో మాత్రమే చాలా అందంగా కనిపిస్తారు. అలానే ఇంకొన్ని సినిమాల్లో మాత్రం చాలా దారుణంగా కనిపిస్తారు. అంటే కొన్ని సినిమా పాత్రలు బట్టి హీరో లుక్స్ మారడం అనేది సహజంగా జరుగుతుంది. ఉదాహరణకు రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పాత్రకు రాంచరణ్ అలానే ఉండాలి. అలానే ఆరెంజ్ సినిమాలో రామ్ అనే పాత్రకు అంత స్టైలిష్ గా ఉండాలి. ఒక పాత్ర దర్శకుడు కథను రాసుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది.
అయితే ఆడియన్స్ కొంతమంది హీరోలను ఎలా చూడటానికి ఇష్టపడతారు అని క్లారిటీ చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. ఆ తక్కువ మంది దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఫెయిల్యూర్ అంటే అనిల్ కెరియర్ లో తెలియలేదు. ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆడియన్స్ ని సంతృప్తిగా థియేటర్ నుంచి బయటకు పంపిస్తాడు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు అందరి ప్రేక్షకులకు నచ్చుతాయి అని చెప్పలేము. అనిల్ ను కొంతమంది టార్గెట్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ విపరీతంగా ప్రేక్షకులు ఆదరించటం వలన అనిల్ రావిపూడి సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి.
అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం టైటిల్ మాత్రమే కాకుండా పండక్కి వస్తున్నారు అని టాగ్ లైన్ పెట్టి మరి పండక్కు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదివరకే తన సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్ గా చూపించినట్లు మెగాస్టార్ చిరంజీవిని కూడా చాలా స్టైలిష్ గా చూపిస్తున్నాడు అనిల్ రావిపూడి.
రీసెంట్ గా ఈ సెట్స్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఒకటి విడుదల చేశారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఎంత స్టైలిష్ గా ఉన్నారు అంటే మెగాస్టార్ కి ఒక్క టైం మిషన్ దొరికి తన జీవితంలో వెనక్కి వెళ్ళిపోతే యంగ్ ఏజ్ లో ఎంత అందంగా కనిపిస్తారో అదే మాదిరిగా ఈ ఫోటోలో కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కంటే ముందు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను తెరకెక్కించాడు అనిల్. ఆ సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ చాలా అందంగా కనిపిస్తారు. కొద్దిపాటి గుబురు గడ్డంతో, స్పెక్ట్స్ పెట్టుకొని మరి స్టైలిష్ గా ఉంటారు వెంకీ మామ. స్క్రీన్ పైన హీరో అందంగా కనిపించినప్పుడు సినిమా మీద మనకు తెలియకుండానే కొంతమేరకు ఆసక్తి కూడా పెరుగుతుంది అనే పాయింట్ కరెక్టుగా పట్టుకున్నాడు అనిల్. అందుకే మెగాస్టార్ చిరంజీవిని కూడా చాలా అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ చూస్తుంటే కొంతమేరకు సక్సెస్ అయ్యాడు అనే అవగాహన కూడా చాలామందికి వచ్చేసింది.
Also Read: Sree Vishnu : శ్రీ విష్ణు కామ్రేడ్ అవతారం… కామెడీ చేసుకోకుండా ఇవన్నీ ఎందుకో?