జిగి హదీద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. గత ఏడాది సెప్టెంబర్ 27న పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఆమె వేసుకున్న దుస్తులు చూసి అందరూ షాకయ్యారు. వెట్మెంట్స్ స్ప్రింగ్ 2025లో భాగంగా ఆమె ధరించిన ఈ టేప్ డ్రెస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణం అయ్యింది. బోల్డ్ లుక్ లో ప్రత్యేకమైన దుస్తుతో ర్యాంప్ వాక్ చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. రోజువారీ ఉపయోగించే టేప్ తో హై ఫ్యాషన్ ను కలిపి ఆమె ఇచ్చిన ప్రదర్శన వావ్ అనిపించింది. ఆమె నిజమైన స్టైల్ స్టార్ అని మరోసారి నిరూపించింది.
జిగి హదీద్ పూర్తిగా పసుపు, ఎరుపు వర్ణంలోని DHL ప్యాకింగ్ టేప్ తో తయారు చేసిన స్ట్రాప్ లెస్ మినీడ్రెస్ ను ధరించింది. షిప్పింగ్ ప్యాకేజీలకు ఉపయోగించే టేప్ ను ఫ్యాషన్ డ్రెస్ గా మార్చుకుంది. ఆ డ్రెస్ అందరినీ ఇట్టే ఇంప్రెస్ చేసింది. సృజనాత్మకతతో కూడిన గ్లామరస్ లుక్ తో పారిశ్రామిక వైబ్ లను మిళితం చేసింది. అంతేకాదు, DHL టేప్ తో చుట్టబడిన మ్యాచింగ్ హై హీల్స్ ను కూడా వేసుకుంది. అదే మెటీరియల్ తో తయారు చేసిన చిన్న హ్యాండ్ బ్యాగ్ ను కూడా తీసుకెళ్లింది. ఈ ఆకర్షణీయమైన, విభిన్నమైన దుస్తులు ఫ్యాషన్ ప్రపంచంలో చాలా చర్చకు దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో దీని గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దుస్తులను వెట్మెంట్స్, DHL మధ్య ఒప్పందంలో భాగంగా ఆమె ధరించింది. ఈ రెండు సంస్థ మధ్య భాగస్వామ్యం 2015 నుంచి కొనసాగుతుంది.
ఇక ఈ టేప్ దుస్తులు ధరించినందుకు గాను, ఆమె రూ.80 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె జీవితాన్ని ఈ ఫ్యాషన్ షో కీలక మలుపు తిప్పింది. 29 సంవత్సరాల వయస్సులో, జిగి హదీద్ చేసిన ప్రదర్శన, ఫ్యాషన్ ప్రపంచంలోనే ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. గ్లామరస్ గౌను అయినా, విచిత్రమైన టేప్ డ్రెస్ అయినా, ఏ దుస్తులనైనా ఇట్టే వేసుకుని అద్భుతంగా హొయలు ఒలికించడంలో జిగి ముందుంటుంది. ఆమె కారణంగా వెట్మెంట్స్ షో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. అదే సమయంలో ఆమె కెరీర్ కు మరో మరపురాని క్షణాన్ని జోడించింది, ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని అందరికీ గుర్తు చేసింది.
ఇక ఈ ముద్దుగుమ్మ 2013లో IMG మోడల్స్ లో చేరింది. ‘ఓషన్స్ 8’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ లోనూ సినిమా రంగంలోనూ ఆమె రాణిస్తోంది. ఈమె రెండు సంవత్సరాల వయస్సులో బేబీ గెస్ కోసం ఒక యాడ్ లో కనిపించింది. 2011లో IMG మోడల్స్ తో ఒప్పందం చేసుకుంది. ఆమె సిస్టర్ బెల్లా హదీద్ కూడా ఒక మోడల్. జిగికి హషిమోటోస్, హైపోథైరాయిడిజం ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
Read Also: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?