Ashu Reddy:సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ అండ్ స్టైలిష్ ఫోటోలని షేర్ చేస్తూ సందడి చేసే అషు రెడ్డి తాజాగా మరోసారి క్రేజీ పిక్స్ తో నెట్టింట్లో రచ్చ లేపింది.బ్లాక్ అండ్ వైట్ చెక్స్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ, తన అందంతో అభిమానుల మతులు పోగొడుతుంది. ఇక ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘యు ఆర్ లుకింగ్ ఎట్ ఏ స్టోన్’ అంటూ పెట్టిన క్యాప్షన్ తో ఒక్కసారిగా అందరిని తన వైపు తిప్పేసుకుంది.
సాధారణంగా సెలబ్రిటీలు ఫోటోలు షేర్ చేస్తే వాటిని వర్ణిస్తూ క్రేజీ క్యాప్షన్ యాడ్ చేయడం వెరీ కామన్. అషు రెడ్డి మాత్రం ఇలా సింపుల్ గా ఒక్క లైన్‌తోనే తన పోస్ట్‌కు మాంచి హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి.ఇక ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో అషు రెడ్డి చాలా సింపుల్‌గా కనిపిస్తూనే అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తోందనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ డ్రెస్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా హెయిర్ స్టైల్, మేకప్ వేసుకోవడంతో ఆమె అందం డబల్ అయిపొయింది.ముఖ్యంగా ఈ ఫోటోలలో అషురెడ్డి ఇచ్చిన ఫోజులు ఫోటో షూట్ కి మెయిన్ ఎసెట్ గా నిలిచిపోయాయి.మొత్తంగా గ్లామర్ గా కనబడటం అంటే ఓవర్ మేకప్ అవసరం లేదని, భారీ కాస్ట్యూమ్స్ తో పనిలేదని, సింపుల్ డ్రెస్ లో కూడా సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ జూనియర్ సామ్.
ఇక అషు రెడ్డి కెరీర్ విషయానికి వస్తే..మొదట్లో డబ్‌స్మాష్, లిప్‌సింక్ వీడియోలతో జూనియర్ సమంతగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లోకి అడుగుపెట్టి సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది.ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె చేసిన సందడి, ఆటతీరుతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.ఇక ఆ పాపులారిటీతోనే సిల్వర్ స్క్రీన్ పై తన లక్ ని టెస్ట్ చేసుకుంటుంది.అ క్రమంలోనే నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ‘చల్ మోహన్ రంగ’ సినిమాతో తెలుగు తెరపై సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే కేవలం సినిమాలే కాకుండా ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల్లోనూ తనదైన మార్క్ ని చూపిస్తుంది అషు. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ఆమె చేసిన ‘నువ్వేవరే’ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ‘రావా’ అనే మరో మ్యూజిక్ ఆల్బమ్ అప్‌డేట్‌తోనూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచింది.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉండే పాటలకు తనదైన స్టైల్‌లో రీల్స్ చేయడంతో నెట్టింట్లో అషు రెడ్డికి మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది.. అందుకే ఆమె ఫోటోలే కాదు, వీడియోలు కూడా పెట్టిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ కొల్లగొడుతుంటాయి.ఇక ఈ క్రమంలోనే తాజాగా ‘యు ఆర్ లుకింగ్ ఎట్ ఏ స్టోన్’అంటూ మరో క్రేజీ ఫోటోషూట్ తో రచ్చ చేస్తుంది ఈ అందాల భామ !