Jr. Ntr : నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన హీరో జూనియర్ ఎన్టీఆర్. నందమూరి కాంపౌండ్ నుంచి వచ్చిన సరే .. తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్క మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని అందుకున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు అటు విదేశీయులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ సినిమాలు పరంగానే కాదు వ్యక్తిత్వంలో కూడా గొప్పవాడే. ఈమధ్య చిన్న హీరోల ఈవెంట్స్ కు హాజరవుతున్నాడు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలి అని ఎన్టీఆర్ ను చూస్తే అర్థమవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి అయిన ఎన్టీఆర్ కు ఒకరిని చూస్తే భయమట. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఎన్టీఆర్ ను భయపెడుతున్నాడు? అతనికి ఏం కావాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే కాస్త వివరంగా తెలుసుకోవాల్సిందే..
నందమూరి ఫ్యామిలికి దూరంగా ఎన్టీఆర్..
టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న నాలుగు కుటుంబంలో ఎన్టీఆర్ కుటుంబం ఒకటి.. ఈ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని నందమూరి కుటుంబం దూరం పెట్టింది. ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సినిమాల్లో రాణిస్తూ స్టార్ డం తెచ్చుకున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు.. నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టిన స్థానంలో ఎన్టీఆర్ ఉంటారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ కు ఓ కుర్రాడు భయాన్ని పరిచయం చేశాడని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ కుర్రాడు మరెవ్వరో కాదు.. ఆయన రెండో కొడుకు అభయ్ రామ్..
అదేంటి కొడుకు ఎక్కడైనా భయపెడతాడా అనే సందేహం మీకు రావచ్చు.. దానికి ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. అభయ్ రామ్ కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే ప్రశ్నలు వేస్తుంటాడు. వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెబుతా అన్నారు. ఒక్కొక్కసారి వాడేం అడుగుతాడో అన్న భయం వేస్తుంది.. వాడిని చూసి పారిపోతానంటూ, ఆ సమయంలో ప్రణతి వాడికి బలైపోతుందని సరదాగా చెప్పుకొచ్చారు తారక్.. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఈగర్ వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ తో మరో భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.. ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.