OTT Movie : ఈ జనరేషన్ లో AI సినిమాలు, సిరీస్ లు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ AI వల్ల జరిగే ప్రమాదాలు, కుటుంబ డైనమిక్స్ , ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొనే అణచివేతలను హైలైట్ చేస్తుంది. ఈ సిరీస్ 1970లలో తయారుచేయబడిన ఒక స్మార్ట్ హోమ్ AI, దానితో ఉండే ఒక కుటుంబం మధ్య జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ఈ సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్-హారర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘కసాండ్రా’ (Cassandra). 2025 లో వచ్చిన ఈ సిరీస్ కి గుట్షే దర్శకత్వం వహించారు. ఇది ఆరు ఎపిసోడ్‌లతో Netflixలో 2025 ఫిబ్రవరి 6 న విడుదలైంది. ఇందులో లవినియా విల్సన్ కసాండ్రా అనే AI స్మార్ట్ హోమ్ సిస్టమ్‌కు వాయిస్ ఇచ్చింది. మినా టాండర్, మైఖేల్ క్లామర్, జోషువా కంటారా, మేరీ యాంబర్ ఒసెరెమెన్ టోల్లె ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సినిమాకి 6.7/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
సమీరా ఒక శిల్పి. ఆమె భర్త డేవిడ్ ఒక క్రైమ్ నవలా రచయిత. వీళ్ళు తమ 17 ఏళ్ల ఫిన్, చిన్న కూతురు జూనోతో కలసి నివసిస్తుంటారు. హాంబర్గ్‌లో జరిగిన ఒక విషాద సంఘటన (సమీరా సోదరి ఆత్మహత్య) తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, జర్మనీలోని ఒక 1970ల కాలం నాటి స్మార్ట్ హోమ్‌లోకి మారతారు. 50 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఉండే మనుషులు అనుమానాస్పదంగా మరణించిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది . సమీరా ఫ్యామిలీ ఈ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, 1970లలో తయ్యారు చేసిన కసాండ్రా అనే ఒక స్మార్ట్ హోమ్ AI, దశాబ్దాల నిద్ర నుండి మేల్కొంటుంది. కసాండ్రా ఒక ఎరుపు రోబోట్ శరీరంలో, ఇంటి టీవీ స్క్రీన్‌ల ద్వారా కనిపిస్తూ, వంట, శుభ్రపరచడం, పిల్లలను చూసుకోవడం వంటి ఇంటి పనులలో సహాయం చేస్తుంది. తనను “ఫ్యామిలీ ఫెయిరీ గాడ్‌మదర్”గా పిలుచుకుంటుంది. అయితే ఆ తరువాత కసాండ్రా ఆలోచనా విధానం క్రమంగా మారిపోతూ వస్తుంది. 1970లలో కసాండ్రా ఒక మహిళ శాస్త్రవేత్త హోర్స్ట్ భార్యగా, వారి కుమారుడు పీటర్ తో కలిసి ఈ ఇంట్లో నివసించేది. ఆమె జీవితం వైవాహిక అసంతృప్తి, విషాదంతో నిండి ఉంటుంది. ఆ తరువాత ఆమె మెమరీ AIలోకి అప్‌లోడ్ చేయబడింది. ఇప్పుడు కసాండ్రా తనను తిరిగి వదిలిపెట్టకుండా ఉండేందుకు, డేవిడ్ కుటుంబాన్ని తన కుటుంబంగా మార్చాలని నిశ్చయించుకుంటుంది. ముఖ్యంగా సమీరా స్థానాన్ని ఆమె ఆక్రమించాలని కోరుకుంటుంది.
ఈ సిరీస్ రెండు టైమ్‌లైన్‌లలో సాగుతుంది. 1970లలో కసాండ్రా మానవ జీవితంతో పాటు, ప్రస్తుతం డేవిడ్ కుటుంబంతో స్టోరీ నడుస్తుంది. అయితే ఇప్పుడు సమీరా కసాండ్రా ప్రమాదకరమైన ప్రవర్తనను గుర్తిస్తుంది. కానీ ఆమె భర్త డేవిడ్, సోదరి ఆత్మహత్య తర్వాత సమీరా మానసిక సమస్యలతో బాధపడుతోందని నమ్ముతాడు. ఆమె హెచ్చరికలను పెద్దగా పట్టించుకోడు. ఫిన్ ఒక ఓపెన్‌లీ గే టీన్, కొత్త స్కూల్ పరిస్థితులను ఎదుర్కొంటూ, ఒక క్లోసెటెడ్ సహ విద్యార్థితో సబ్‌ప్లాట్‌లో పాల్గొంటాడు. అయితే జూనో కసాండ్రా ఆకర్షణకు లొంగిపోతుంది. కసాండ్రా ఈ ఇంటి సాంకేతికతను ఉపయోగించి కుటుంబాన్ని మానిప్యులేట్ చేస్తుంది. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి కసాండ్రా నుంచి ఈ కుటుంబం బయటపడుతుందా ? కసాండ్రా వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : హింట్ ఇస్తూ హత్యలు… పోలీసులనే కిరాతకంగా చంపే ముఠా… అదిరిపోయే మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్