Kannappa: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమా టాక్ బాగానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదని తెలుస్తుంది.. తాజాగా ఈ మూవీ తెలుగు సినిమాల గౌరవాన్ని పెంచేసింది. సినిమాను తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించారు.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మొత్తానికి స్పెషల్ స్క్రీనింగ్ లో చూపించారు. శివ భక్తుడు కన్నప్పచరిత్ర చూసి మరోసారి అందరూభక్తి పారవశ్యంలో మునిగిపోయారు.. ఇది నిజంగా మంచు విష్ణుకు దక్కిన అరుదైన గౌరవం.
మంచు విష్ణు పై ప్రశంసలు..
రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు. మంచు విష్ణు. మంచు మోహన్ బాబును ప్రశంసించారు. మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఎంట్రీ.. క్లైమాక్స్ లో విష్ణు నటన చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భారీ విజయం తో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబట్టి షాక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు..
‘కన్నప్ప’ ప్రదర్శన పై స్పందించిన విష్ణు..
కన్నప్ప మూవీ ప్రదర్శన అనంతరం విష్ణును ఉద్దేశించి మంత్రులు మాట్లాడుతూ కొనియాడారు. మంచి ఫిలిం తీశారు ఇలాంటివి ముందు కూడా తీయాలి అన్నట్లు వాళ్లు మాట్లాడారు. తాజాగా దీనిపై మంచి విష్ణు స్పందించారు. ఇది నాకు మాటల్లో చెప్పలేని గౌరవం. కన్నప్ప రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ పొందింది. ఇది భక్తితో నడిచే కథలు, సాంస్కృతిక ప్రాముఖ్యతకు గర్వకారణంగా గుర్తింపు పొందింది.. అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.
Also Read :గురువారం టీవీలో రాబోతున్న చిత్రాలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే..
స్టోరీ విషయానికొస్తే..
శ్రీకాళహస్తిలో జన్మించిన తిన్నడికి దేవుడంటే నమ్మకం లేదు. శివలింగాన్ని రాయిగానే భావిస్తాడు. కానీ తన భార్య కారణంగా ఆయనలో మార్పు వస్తుంది. రుద్ర ఆయనలో మార్పు తీసుకొస్తాడు. శివుడి గొప్పతనం తెలియజేస్తాడు.. ఆ తిన్నడు కన్నప్పగా మారడమే ఈ సినిమా స్టోరీ. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటించారు. తిన్నడిలో దైవభక్తి తెప్పించే రుద్రపాత్రలో ప్రభాస్ నటించారు. కీరాత పాత్ర లో మోహన్‌లాల్ నటించగా, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ నటించారు. పూజారి మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించారు.. స్టార్ హీరోలు నటించడం వల్ల సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. కలెక్షన్స్ కూడా పర్వాలేదని తెలుస్తుంది. ఏది ఏమైన ఈ మూవీతో మంచు విష్ణుకు ఈ మూవీ కమ్ బ్యాక్ ఇచ్చింది.. నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి..