Nag Aswin : టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ డైరెక్టర్ గా అతి తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగాడు. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్ లో అందరి దృష్టి ఆయనపై పడేలా చేసుకున్నారని చెప్పాలి.. డైరెక్టర్ అవ్వకముందు స్క్రీన్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ మూవీతో హిట్ కొట్టాడు. ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు..
మహానటి మూవీతో యావత్ సినీ అభిమానులు మనసును దోచుకున్నాడు. ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. ఇక కల్కి 2898 ఏడీ మూవీతో కెరీర్ లో పెద్ద హిట్ ను సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆ సినిమాతో నేషనల్ వైడ్ గా మెప్పించారు.. ఆ తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కల్కి సినిమా చేశాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఆ మూవీకి సీక్వెల్ గా మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పార్ట్ కాస్త కంప్లీట్ అయినప్పటికీ.. రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి టైమ్ పడుతుంది. ముఖ్యంగా ప్రభాస్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఆయనకు టైం దొరికినప్పుడే సినిమాను పూర్తి చెయ్యనున్నాడని సమాచారం.
Also Read : బుధవారం బోలెడు సినిమాలు.. వాటిని తప్పక చూడాల్సిందే..
నాగీ ప్రస్తుతం ఓ చిన్న సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాక్. ఎవడే సుబ్రహ్మణ్యం స్టైల్ లో.. ఓ సెన్సిబుల్ స్టోరీతో మరో మూవీ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతుందని సమాచారం.. అంతా కొత్తవాళ్లే నటిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక అన్ని వివరాలు ప్రకటించనున్నారని సమాచారం.. చిన్న సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత కల్కి 2 మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. మొత్తానికి నాగీ మామ ప్లాన్ మాములుగా లేదు.. ఆ మూవీ హిట్ అయితే మళ్లీ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నట్లే.. కల్కి 2 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.