OTT Movie : హారర్ జానర్ ని చూడటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు ప్రేక్షకలు. ఈ జానర్ సినిమాలు ఎప్పుడు వచ్చినా ట్రెండింగ్ లో ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు హారర్ ఎలిమెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో సక్సెస్ సాధించినా, యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒక ఐలాండ్ లో జరుగుతుంది. అక్కడికి వచ్చే మనుషులను ఒక ఘోస్ట్ భయంకరంగా హంట్ చేస్తుంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ వరకు బాడీని షేక్ చేస్తుంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“ఐలాండ్ ఆఫ్ ది డాల్స్” (Island of the dolls) 2023లో విడుదలైన హారర్ చిత్రం. ఇది జాక్ ఈ. బెల్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో హొవర్డ్ జే. డేవీ (హొవర్డ్), ఆబీ కాసన్ థామసన్ (ఆబీ), బీట్రైస్ ఫ్లెచర్ (బీట్రైస్), లూయిస్ సైకమోర్ (లూయిస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 20 నిమిషాల రన్ టైమ్ తో 2023 జనవరి 13న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఈ సినిమా స్టోరీ మెక్సికోలోని ఒక ఐలాండ్ లో జరుగుతుంది. ఇక్కడ వేలాది బొమ్మలు ఉంటాయి. ఇవి ఒక వృద్ధుడు ఒక చిన్న అమ్మాయి దయ్యాన్ని ప్లీజ్ చేయడానికి అలంకరించి ఉంటాడు. ఇప్పుడు కథ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఐలాండ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో మొదలవుతుంది. వీళ్ళు ఈ ఐలాండ్ డెడ్లీ సీక్రెట్‌ను తెలుసుకోవడానికి వస్తారు. ఇక్కడ వీళ్ళకు కొన్ని బొమ్మలు చాలా వింతగా, క్లీన్‌గా కనిపిస్తాయి. వీళ్ళు ఐలాండ్ లెజెండరీ హిస్టరీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న అమ్మాయి, ఇక్కడ డ్రౌనింగ్‌లో చనిపోతుంది. ఆమె దయ్యంగా మారి ఇప్పుడు బొమ్మల ద్వారా రివెంజ్ తీర్చుకుంటుంది. ఆ దయ్యం కొత్త మనుషుల కోసం చూస్తూ ఉంటుంది.
ఈ గ్రూప్ అక్కడికి రావడంతో కథలో టెన్షన్ బిల్డ్ అవుతుంది. ఐలాండ్‌లో ఈ బొమ్మలు మూవ్ అవుతున్నట్లు కనిపిస్తాయి. ఘోస్ట్ గర్ల్ రన్ చేస్తూ కనిపిస్తుంది. అక్కడ ఒక బొమ్మ వీళ్ళను చంపడానికి వస్తుంటుంది. క్లైమాక్స్‌లో ఈ గ్రూప్ ఘోస్ట్ రివెంజ్‌కు గురవుతుంది. ఆ ఘోస్ట్ చేతిలో ఇక్కడ చాలా మంది చనిపోతారు. ఈ సినిమా ఘోస్ట్ ట్రాజిక్ పాస్ట్‌ను రివీల్ చేస్తూ, ఒక కన్ఫ్యూజింగ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. చివరికి ఈ ఘోస్ట్ గతం ఏమిటి ? ఎందుకు అక్కడికి వచ్చినోళ్లను వెంటాడుతుంది ? ఆ బొమ్మలను అలంకరించిన వృద్ధుడు ఎవరు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : చిన్న క్లూ కూడా వదలకుండా చంపే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న సీట్ ఎడ్జ్ కన్నడ క్రైమ్ కథ