BigTV English
Advertisement

Jemimah Rodrigues: మరోసారి దొరికిపోయిన జెమిమా… హిందూ ధర్మాన్ని అవమానిస్తూ!

Jemimah Rodrigues: మరోసారి దొరికిపోయిన జెమిమా… హిందూ ధర్మాన్ని అవమానిస్తూ!

Jemimah Rodrigues: మహిళల వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఆదివారం రాత్రి చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళా క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాని 52 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో ముఖ్యంగా భారత క్రీడాకారిని జమీమా రోడ్రిక్స్ బ్యాటింగ్ దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో {127*} పరుగుల ఇన్నింగ్స్ ఆడిన జమీమా.. భారత్ ని విజయానికి మరింత చేరువ చేసింది.


Also Read: IND VS SA: నీకు సిగ్గుందా.. ఏబీ డివిలియర్స్ పై న‌టి హాట్ కామెంట్స్‌.. ఇండియాకే వెళ్లిపో !

మూడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగి 134 బంతుల్లో 14 ఫోర్ లతో 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్ కీ తీసుకువెళ్లింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం ఆమె భావద్వేగంగా మాట్లాడిన మాటలు చర్చకు దారి తీసాయి. మ్యాచ్ గెలిచిన అనంతరం జమీమా మాట్లాడుతూ.. ” ముందు నేను జీసస్ కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను సొంతంగా పోరాడలేకపోయాను. ఆయనే నన్ను ముందుకు నడిపించాడు” అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో పలువురు రాజకీయ నేతలతో పాటు హిందూ సంఘాల నుంచి కూడా జమీమాపై విమర్శలు వెలువడ్డాయి.


జ్యోతి వెలిగించడం హిందూ ధర్మం:

హిందూ ధర్మాన్ని ఆచరించే వారికి పూజల గురించి, దీపారాధన గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇందులో చాలా రకాల ఉపచారాలు, విధివిధానాలు ఉన్నాయి. ఈ దీపారాధనలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో దీపం వెలిగించడం ఒక ఎత్తు. చాలామంది పూజలు, వ్రతాలు, ఏదైనా శుభకార్యాన్ని మొదలుపెట్టేముందు ఈ జ్యోతిని వెలిగిస్తుంటారు. ఇలాంటివారు ఎప్పుడూ దీపం పట్ల ఎరుకతో ఉంటూ దీపం శాంతం కాకుండా నూనెను పోస్తూ ఉంటారు. అయితే ఈ దీపాన్ని వెలిగించడం మాత్రమే కాకుండా సంరక్షించడం కూడా చాలా ఓపికతో కూడుకున్నది. ఇలా హిందూ ధర్మంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ విషయంలో జమీమా మరోసారి హిందూ ధర్మాన్ని అవమానించిందని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు.

హిందూ ధర్మాన్ని అవమానిస్తూ?

సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలతో చర్చనియాంశంగా మారిన జమీమా.. తాజాగా ఐసీసీ నిర్వహించిన ఈవెంట్ లో చేసిన ఓ పనితో మరోసారి విమర్శలకు గురవుతుంది. తాజాగా ఐసీసీ ఓ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు, మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, దేవజిత్ సైకియా, జై షా, పలువురు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మొదట జ్యోతిని వెలిగించారు టీమిండియా మహిళా క్రికెటర్లు.

Also Read: Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన‌… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?

అయితే జమీమా తన చేతిలోని క్యాండిల్ తో జ్యోతిని వెలిగించింది. అనంతరం ఫోటో దిగుతున్న సమయంలో తన చేతిలో ఉన్న క్యాండిల్ ని పక్కకి విసిరేసింది. ఈ నేపథ్యంలో జమీమా హిందూ ధర్మాన్ని అవమానించిందని.. హిందూ ధర్మంలో ఎంతో గొప్పగా భావించే జ్యోతిని వెలిగించిన అనంతరం ఇలా చేయడం సరికాదని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. అలాగే ఈ వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

Related News

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

SRH -IPL 2026: హైద‌రాబాద్ ఫ్యాన్స్ కు షాక్‌… కాటేర‌మ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?

IND VS SA: ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రు.. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎందుకు వైర‌ల్ అయింది?

IPL 2026-KKR: కేకేఆర్ లో వేలుపెట్టిన గంభీర్‌…హ‌ర్షిత్ రాణాకు కెప్టెన్సీ ?

IND VS SA: నీకు సిగ్గుందా.. ఏబీ డివిలియర్స్ పై న‌టి హాట్ కామెంట్స్‌.. ఇండియాకే వెళ్లిపో !

Team India: టీమిండియా మ‌హిళ‌ల‌కు రూ.1000ల‌ జీతమేనా..దిగ‌జారిన బీసీసీఐ ?

Harmanpreet Kaur: పాకిస్తాన్ ఇజ్జ‌త్ తీసిన హ‌ర్మ‌న్‌ప్రీత్‌…ఇక న‌ఖ్వీగాడు ఉరేసుకోవాల్సిందే !

Big Stories

×