Bahubali The Epic : పౌరాణిక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శకనిర్మాతలు ఈ మధ్య కొత్త స్టోరీలను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అలాంటి స్టోరీలతో వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో బాహుబలి కూడా ఒకటి. ఈ మూవీ రెండు పార్టులు గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఆ రెండు సినిమాలను బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు.. అక్టోబర్ 31 న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. నాలుగు రోజులకు దాదాపు 40 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కర్ణాటకలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. రీ రిలీజ్ లో కూడా అక్కడ రికార్డుని నమోదు చేసుకుంది. ఆ రాష్ట్రంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
ఈ మూవీ రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అయ్యింది. రీ రిలీజ్ అయిన సినిమా కాబట్టి కలెక్షన్లు తక్కువగా వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అయ్యాయి. వీకెండ్ డు ఈ సినిమాకి మంచి కలెక్షన్లను అందించింది. నవంబర్ 1న రవితేజ నటించిన మాస్ జాతర సినిమా థియేటర్లలోకి వచ్చింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎక్కువమంది బాహుబలి ది ఎపిక్ మూవీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కర్ణాటకలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఇప్పటివరకు దాదాపు నాలుగు కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం.. కర్ణాటకలో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తోంది.. అక్కడ రీరిలీజ్ అయిన సినిమాలు అన్నిటి కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది అని తెలుస్తోంది. సో ఇలా రీ రిలీజ్ లో కూడా బాహుబలి సత్తా చాటుతుంది అన్నమాట..
Also Read :అమూల్యకు ప్రపోజ్ చేసిన విశ్వం.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. భద్రకు బిగ్ షాక్..
టాలీవుడ్ ఇండస్ట్రీలలో కొత్త సినిమాలతో పాటుగా రీ రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలన్నీ కూడా మళ్లీ ఒకసారి రీ రిలీజ్ అవుతున్నాయి.. అయితే ఇప్పటివరకు మళ్లీ థియేటర్లోకి వచ్చిన సినిమాలతో పోలిస్తే బాహుబలి రికార్డు స్థాయిలో వసూళ్లను కలెక్ట్ చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.. ఈ మధ్య ఈ సినిమాకు వచ్చిన అన్ని కలెక్షన్స్ ఏ సినిమాకి రాకపోవడంతో మరోసారి బాహుబలి సత్తాని చాటుతుంది. 40 కోట్లకు పైగా వసూలు చేసింది.. అంటే త్వరలోనే 100 కోట్లు వసూల్ చేస్తే అవకాశం కూడా ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది…