E-Paper
Advertisement

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement

Film industry: ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హీరోయిన్స్ కి చాలా తక్కువ రెమ్యూనరేషన్ లభించేది. ముఖ్యంగా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు చాలా తక్కువ. వాస్తవానికి హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 నుండి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే.. హీరోయిన్స్ కి కేవలం రూ.5 లేదా రూ.8 కోట్లతో సరిపెడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండు పూర్తిగా మారిపోయింది. కాలానికి అనుగుణంగా హీరోయిన్లు కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అదరగొట్టేస్తున్నారు.

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్..

ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్స్ టాలెంట్ ను మెచ్చి అత్యధిక రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతూ.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్స్ కి , వారి టాలెంట్ కు తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా లభిస్తోంది. మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరెవరున్నారు? ఆ జాబితాలో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:లవ్ అనేది వ్యాధి.. బ్రేకప్ పై నూకరాజు ఎమోషనల్ కామెంట్స్!

మొదటి స్థానం ఎవరికంటే?

ఒకప్పుడు కోలీవుడ్ ద్వారా తన సినీ కెరియర్ను ప్రారంభించిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీని వదిలి హాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె.. ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుని.. గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. అలాంటి ఈమె ఇప్పుడు తెలుగులో ‘వారణాసి’ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది ప్రియాంక చోప్రా. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా మొదటి స్థానంలో నిలిచింది ప్రియాంక చోప్రా.

మిగతా స్థానాలలో ఈ ముద్దుగుమ్మలదే హవా..

Advertisement

ప్రియాంక చోప్రా తర్వాతి స్థానాలలో దీపికా పదుకొనే (Deepika Padukone) రెండవ స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకి సుమారుగా రూ.20 నుండి రూ.25కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాగే మూడవ స్థానంలో అలియా భట్ నిలిచింది. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న అలియా భట్ (Alia Bhatt) రూ. 18 నుండి రూ.23 కోట్ల. వరకూ తీసుకుంటుండగా కత్రినా కైఫ్ (Katrina Kaif) రూ.15 నుండి రూ.20 కోట్లు తీసుకుంటున్నారు.

దక్షిణాది భామల సంగతేంటి?

దక్షిణాది భామల విషయానికి వస్తే. సౌత్ లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara), సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) వీరు ఒక్కొక్కరు ఒక్కో మూవీకి రూ.10 నుండి రూ.12 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హీరోలతో సమానంగా పోటీపడుతూ.. ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.

Related News

నాని – నితిన్ కొత్త మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

హీరోయిన్ రితికా నాయక్ రియల్ లైఫ్ లో కష్టాలు .. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

డ్యాన్సర్ అసోసియేషన్లో మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ మండిపాటు!

Big Stories

Advertisement
×