BigTV English

Rasool Ellore: సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా.. అల్లు అర్జున్, గోపీచంద్ సినిమాల్లో నటించి ?

Rasool Ellore: సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా.. అల్లు అర్జున్, గోపీచంద్ సినిమాల్లో నటించి ?

Rasool Ellore: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమ గుర్తుందా..? ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ముస్లిం అమ్మాయి గుర్తుండకుండా ఉండదు. అబే రెడ్డప్ప.. నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ.. హోల్ సిటీ అంటూ రచ్చ చేసిన ఆ అమ్మాయే జాహ్నవి. ఈ పాత్రను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఇంకా చెప్పాలంటే యజ్ఞం సినిమాలో హీరోయిన్ కన్నా జాహ్నవికే ఎక్కువ పేరు వచ్చిందనే చెప్పొచ్చు. ఇక యజ్ఞం లోనే కాకుండా హ్యాపీ సినిమాలో జెనీలియా ఫ్రెండ్ గా కూడా నటించింది మెప్పించింది.


 

జాహ్నవి అరోరా.. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ భామ.. తన అందంతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసింది.ఆ తర్వాత నెమ్మదిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోల సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసిన జాహ్నవి కొన్ని సినిమాలకే పరిమితమయ్యింది. ఆ తరువాత ఈ యాంకరమ్మ ఎక్కడ కనిపించింది లేదు.అవకాశాలు లేక పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది అనుకున్నారు అంతా. పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే కానీ, ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయమే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ గురించి తెలియని వారుండరు. ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రసూల్.. ఒకరికి ఒకరు,సంగమం, భగీరథ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.


 

ఒకరికి ఒకరు సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. మిగతా రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రసూల్ భార్యనే జాహ్నవి. ఏంటి.. నిజమా.. ? అని ఆశ్చర్యపోకండి. నిజమే.. అది కూడా ప్రేమ వివాహం అంట. ఒకరికి ఒకరు సినిమా సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారి. పెళ్ళికి దారితీసిందంట. పెళ్లి తరువాత జాహ్నవి కుటుంబానికే పరిమితమయ్యిందట. తాజాగా తన భార్య సీక్రెట్ ను రసూల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 

” ఒకరికి ఒకరు సినిమా సెట్ లో మొదటిసారి జాహ్నవిని చూసాను. అక్కడే మా పరిచయం ప్రేమగా మారింది. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు. పెళ్లి తరువాత సినిమాల్లో జాహ్నవి నటించకపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. మొదట మేము మాట్లాడుకున్నాం. దాని ప్రకారమే కట్టుబడి ఉన్నాం. జాహ్నవి తలుచుకుంటే ఒక మంచి దర్శకురాలు కాగలదు. ఆమెలో ఆ టాలెంట్ ఉంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రసూల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. ఆమె మళ్లీ సినిమాలు చేస్తే బావుంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే  యజ్ఞం సమయంలో సన్నగా కనిపించిన జాహ్నవి పెళ్లి తరువాత బరువు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడా కనిపించకపోయినా.. ఆమె చివరిగా బయట కనిపించిన ఫోటోలలో మాత్రం అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ ఆమె అలానే ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!

Big Stories

×