Fish Venkat Health Update : తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా దాదాపు 100 చిత్రాలకు పైగా నటించిన నటుడు ఫిష్ వెంకట్. ఈయన నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు సినిమాలతో కడుపుబ్బ నవ్వించిన ఆయన ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై ప్రాణాలతో పోరాడుతున్నాడు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఓవైపు ఆరోగ్యం బాగాలేక, మరోవైపు చేతిలో డబ్బులు లేక ఫిష్ వెంకట్ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రాణాల మీదకు రావడం బాధాకరం. ఆయన పరిస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కొంత ఆర్థిక సాయం అందించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి ఆయనను పరీక్షించిన వైద్యులు బిగ్ టీవీ తో చెప్పారు..
తీవ్రమైన అనారోగ్య సమస్యలు..
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. గతంలో చికిత్సకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.2 లక్షలు సాయం కూడా చేశారు. కానీ అప్పుడు తాత్కాలికంగా కోలుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ ఆస్పత్రి బెడ్ పై చావు బతుకుల్లో ఉన్నారు. ఆయనకు సరైన ట్రీట్ మెంట్ అందిస్తే బతికే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు..
వెంకట్ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేశారు. కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. దాంతో ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన ప్రాణాలకు ముప్పు తప్పుతుందని, అదొక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వెంకట్ పరిస్థితి మరింత దిగజారడంతో ఆయన భార్య కూతురు సినీ ప్రముఖులను, అలాగే పలువురిని ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఫిష్ వెంకట్ కి చికిత్స అందిస్తున్న డాక్టరు తాజాగా బిగ్ టీవీతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి డయాలసిస్ చేస్తే బాగుంటుందని ఆ తర్వాత మళ్లీ సిక్ అయిపోతున్నారని అన్నారు. ఎక్కువగా ఆయన స్పృహలో ఉండటం లేదు.. డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీను మారిస్తే బ్రతికే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతున్నారు.
Also Read : ‘ తమ్ముడు ‘ మూవీ ఫస్ట్ రివ్యూ.. నితిన్ హిట్ కొడతాడా..?
ఫిష్ వెంకట్ సినిమాల విషయానికొస్తే..
నటుడుగా ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్స్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, ఢీ, యోగి, దుబాయ్ శ్రీను, క్రిష్ణ, బుజ్జిగాడు, రెడీ, ఆంజనేయులు, అదుర్స్, మిరపకాయ్, కందిరీగ, రచ్చ, గబ్బర్ సింగ్, బలుపు, అత్తారింటికి దారేది వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పలువురు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది: వైద్యుడు
ఫిష్ వెంకట్ కిడ్నీ కండీషన్ బాగోలేదు, డయాలసిస్ చేస్తున్నాం
ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది
ఫిష్ వెంకట్ ఆరోగ్యం మెరుగవ్వాలంటే కిడ్నీ మార్పిడి అవసరం
– డాక్టర్ pic.twitter.com/SCDheq22m0
— BIG TV Breaking News (@bigtvtelugu) July 2, 2025