Hero Vishal : తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు విశాల్ సుపరిచితమే.. ఈ హీరోకు తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థల లైకా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. గతంలో విశాల్ తీసుకున్న డబ్బులకు వడ్డీ వేసి చెల్లించాలని కోరుతూ కోర్టును అశ్రయించారు. ఈ కేసు పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు విశాల్ కు కోర్టు నోటీసులు పంపించారు. ఈ వాదనలు ఆలకించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని విశాల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.. అసలు లైకా నిర్మాణ సంస్థ దగ్గర విశాల్ అప్పు తీసుకోవడానికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
హీరో విశాల్ ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. అయితే తన నిర్మాణ సంస్థ కోసం గోపురం ఫిలిమ్స్ దగ్గర 21 కోటికి పైగా అప్పు తీసుకున్నారు. ఆ అప్పుని లైకా సంస్థ చెల్లిస్తామని ముందుకు వచ్చారు. అన్నట్లుగానే గోపురం ఫిలిమ్స్ కి లైకా 21 కోటి చెల్లించింది. అంతే కాదు నెక్స్ట్ విషయాలు తమ ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమాలకు అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. అయితే విశాల్ లైకా రూల్స్ బ్రేక్ చేయడంతో డబ్బులను కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లైకా నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు విశాల్ కు నోటీసులు జారీ చేసింది. వెంటనే డబ్బులను కట్టాలని అందులో రాసి ఉంది.. మరి దీనిపై విశాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
హీరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడిన విశాల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం మగుడం.. దర్శకుడితో వచ్చిన విభేదాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాల్ ఈ సినిమా నుంచి మధ్యంతరంగా తప్పుకోవడం గమనార్హం.. ఈ మూవీ తీసుకునే రెమ్యునేషన్‌ను హైకోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని లైకా తరపు లాయర్ కోరారు.
Also Read : ‘బిగ్ బాస్ 9’ అయేషా బ్రేకప్ స్టోరీ.. ఇన్ని ట్విస్ట్ లు ఏంట్రా బాబు..
గతంలో అనీషా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు విశాల్.. అయితే కారణాలు ఏమో తెలియదు కానీ వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక విశాల్ హీరోయిన్ సాయి ధన్సిక ని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.. వీళ్ళ పెళ్లి డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం లైకా సమస్య పై విశాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..