Thammudu First Review: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.. ప్రస్తుతం నితిన్ తమ్ముడు మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. వకీల్ సాబ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను రీసెంట్గా పూర్తి చేసుకుంది. సెన్సార్ రివ్యూ? ఏంటి ఈ సినిమా బడ్జెట్? అలాగే స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‘తమ్ముడు’ సెన్సార్ రివ్యూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిట్ చిత్రాలలో తమ్ముడు సినిమా ఒకటి.. ఇదే టైటిల్ తో ఇప్పుడు హీరో నితిన్ మరో సినిమాను చేశాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాదాపు 75 కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టినట్లు తెలుస్తుంది.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే తమ్ముడు సినిమా 2023 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. నితిన్ గాయపడి విశ్రాంతి తీసుకోవడం, ఇతరత్రా కారణాల వల్ల 2024 సంవత్సరంలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం జూలై 4 తేదీకి విడుదల ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. సెన్సార్ అధికారులకు ప్రివ్యూ షోను ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన తర్వాత పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ కొన్ని సీన్లను కట్ చేస్తే.. U/A సర్టిఫికెట్ ఇస్తే యూ/ఏ లేదా ఏ సర్టిఫికెట్ ఇస్తామని సూచించారు. అయితే ఈ సినిమాలోని అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను కట్ చేయడానికి నిర్మాత, దర్శకుడు నిరాకరించారు. దాంతో ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు షాక్ ఇచ్చారు. కేవలం ఏ సర్టిఫికెట్ ను మాత్రమే ఇచ్చారు. అడల్ట్ కంటెంట్ గీత దాటి ఉండదు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమని చిత్ర యూనిట్ తెలిపింది.. ఈ చిత్రం రన్ టైమ్ 2.25 గంటలు అంటే 145 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది.. ఇక ఈ సినిమా రేపు గ్రాండ్గా థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది. మరి సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అలాంటి సీన్లు ఉన్నాయా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే..
Also Read: పారిపోయి పెళ్లి చేసుకున్న..అద్దెకు కట్టడానికి డబ్బులేక కష్టాలు..
స్టోరీ విషయానికొస్తే..
తమ్ముడు స్టోరీ విషయానికొస్తే.. ఒక మారుమూల ప్రాంతమైన అంబరగొడుగు అనే ప్రాంతం బ్యాక్ డ్రాప్‌తో జరిగే కథ . నితిన్ విలువిద్య క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. 24 గంటల వ్యవధిలో జరిగే తమ్ముడు సినిమా కథ మొత్తంగా 80 శాతం అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించారు. ఈ చిత్రంలో 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. విజువల్, సౌండ్ అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.. ఇకపోతే ఇందులో నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ నటిస్తుంది. అమ్మ నాన్న లేని నితిన్ ని అక్కే అన్ని తానై పెంచుతుంది. ఊహ తెలిసినప్పటి నుంచి నితిన్ అక్కని అమ్మగా భావించి ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద అగాధం జరిగిందని అందుకే వాళ్ళు విడిపోయి మళ్లీ కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్క తమ్ముళ్ల సెంటిమెంట్తో పాటు యాక్షన్స్ అన్వేషాలు కూడా ఈ సినిమాలో ఉన్నట్లు ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ని అందిస్తున్నాయి.. సినిమా బిజినెస్ విషయానికొస్తే. అన్ని ఏరియాలో మంచిగానే బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. మంచి టార్గెట్ తోనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో రేపు తెలియనుంది..