Siddhu Jonnalagadda:ప్రముఖ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) తాజాగా నీరజాకోన దర్శకత్వంలో చేసిన చిత్రం ‘తెలుసు కదా’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), రాశిఖన్నా(Raashii khanna) హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఒకవైపు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంటే.. మరొకవైపు సిద్దు జొన్నలగడ్డపై సోషల్ మీడియాలో పూర్తి వ్యతిరేకత నెలకొంది. దానికి కారణం ఫేవరెట్ హీరో వివాదం అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు తెలుసు కదా సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో నిన్న ఈయన ఎక్స్ వేదికగా “ఆస్క్ సిద్ధూ” పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సిద్దూ చెప్పిన సమాధానము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. సిద్ధూ అభిమాని మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని అడగగా.. క్షణం ఆలోచించకుండా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయనపై విపరీతమైన ట్రోలింగ్ అవుతోంది. తెలుగులో ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. బాలీవుడ్ హీరోను అభిమాన నటుడుగా పేర్కొనడం ఏంటి? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ హీరోలే సిద్దూని సపోర్ట్ చేస్తుంటే.. ఈయన మాత్రం బాలీవుడ్ హీరోని మెచ్చుకోవడం ఏంటి అంటూ మరికొంతమంది ఫైర్ అవుతున్నారు.
ALSO READ:Samyuktha Menon: విమెన్ సెంట్రిక్ మూవీతో సంయుక్త.. సక్సెస్ అవుతుందా?
ఇలాంటి సమయంలో ఇంకొంతమంది ఈయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సిద్ధూ అభిప్రాయాన్ని గౌరవిస్తూ.. అభిప్రాయాలు భాషను బట్టి , ప్రాంతాన్ని బట్టి రావు.. ఒక వ్యక్తిపై మంచి అభిప్రాయం ఏర్పడాలి అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలాంటి వాటిని ఎందుకు నెగిటివ్గా చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే ఫేవరెట్ హీరో వివాదం ఇప్పుడు హీరో పై నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కొనేలా చేసింది అని చెప్పడంలో సందేహం లేదు.
సిద్ధూ జొన్నలగడ్డ విషయానికొస్తే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతకుముందు జోష్, ఆరెంజ్ , భీమిలి వంటి చిత్రాలలో సహాయక పాత్రలలో నటించారు. గుంటూరు టాకీస్, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే గ్యాంగ్ స్టార్లు అనే టెలివిజన్ సిరీస్ లో కూడా నటించారు. ప్రస్తుత ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగానే కాకుండా.. గీత రచయితగా, సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.