TV Actress:సాధారణంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పలువురు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అలా సినిమాలు లేదా సీరియల్స్ చేస్తున్నప్పుడే భారీగా వెనుక వేసుకున్న సెలెబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినిమాల ద్వారా.. సీరియల్స్ ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టి.. ఇప్పుడు శేష జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే మరికొంతమంది దానధర్మాలకు పోయి, వ్యసనాలకు పోయి, అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితి దిగజారి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాంటి వారి జాబితాలోకి ఇప్పుడు ఒక ప్రముఖ సీరియల్ నటి చేరిపోయింది.
నిర్మాణ కార్మికురాలిగా మారిన సత్య దేవరాజన్..
ఆమె ఎవరో కాదు సత్యదేవరాజన్ (Sathya Devarajan). కోలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం ఏదో ఒక వార్తతో వైరల్ గా మారుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకోగా, ఈ వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రోజూ వారి కార్మికురాలిగా ఇటుకలు మోస్తూ.. ఇంస్టాగ్రామ్ లేదు కదా ఈ వీడియో షేర్ చేయడంతో అందరూ సత్యకు ఇంత దీనస్థితి వచ్చిందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే..?
ఇకపోతే సత్య ఇలా కార్మికురాలిగా మారడం వెనుక అసలు కథ తెలిసి ఇదా సంగతి అంటూ కామెంట్లు చేస్తున్నారు అసలు విషయంలోకి వెళ్తే.. సత్య తమిళ్ సీరియల్ ‘ధనం’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. చిన్న మారుమకలు సీరీస్ కి దర్శకత్వం వహించిన మనోజ్ కుమార్ (Manoj Kumar) ఈ సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సత్య తన ఆటో డ్రైవర్ భర్త మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను తీసుకుంటుంది. తన కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి నిర్మాణ కార్మికురాలిగా మారింది. ఇప్పుడు ఆమె పాత్రకు సంబంధించిన వీడియోని ఇలా షేర్ చేయడంతో అభిమానులు ఇదా అసలు సంగతి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
ఇకపోతే సత్య దేవరాజన్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక ఫోటో లేదా వీడియోతో అభిమానులను నిత్యం అలరిస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా సీరియల్ లోని తన పాత్రకు సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో మొదట అందరూ ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత తెగ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం సత్య దేవరాజన్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కక్షణం అందరిని బాధ పెట్టావు కదా తల్లి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
also read:Poonam Kaur: కాపీ డైరెక్టర్.. త్రివిక్రమ్ పై పూనమ్ మరో సంచలన పోస్ట్
?utm_source=ig_web_copy_link