Mohan Lal: మోహన్ లాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు కేవలం మలయాళం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా సుపరిచితుడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
చాలా సందర్భాలలో పెద్దపెద్ద యాక్టర్స్ అంతా బెస్ట్ యాక్టర్ మీ దృష్టిలో ఎవరు అంటే చెప్పిన పేరు మోహన్ లాల్. తాను చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి ఓటిటిలో చూస్తూ ఉంటారు. మోహన్ లాల్ కథలను ఎన్నుకునే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న నెంబర్ వన్ యాక్టర్స్ లో అతను కూడా ఒకడు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.
ఫహద్ ఫాజిల్ అంటే మోహన్ లాల్ కి ఇష్టం లేదా ?
ఫహద్ ఫాజిల్ గురించి కూడా ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు ఫహద్ ఫాజిల్ సినిమాలను వెతుక్కుని మరీ చూస్తారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత అతని రేంజ్ ఇంకా మారిపోయింది. సుకుమార్ లాంటి దర్శకులు ఒక పాత్ర కోసం అతనిని వెతుక్కుంటూ వెళ్లారు అంటేనే అతని టాలెంట్ ఏంటో కొత్తగా అర్థం అవుతుంది. అయితే మోహన్ లాల్ కు ఫహద్ ఫాజల్ అంటే ఇష్టం లేదా. ? రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం సినిమా టీజర్ విడుదలైంది.
ఈ టీజర్ మొదలైన వెంటనే ఒక వ్యక్తి మోహన్ లాల్ కేరళా అని చెప్పగానే, నాకు మలయాళం సినిమాలంటే విపరీతమైన ఇష్టం. నా గర్ల్ ఫ్రెండ్ కు మాత్రం బాలీవుడ్ సినిమాలంటే ఇష్టం. నాకు ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ విపరీతమైన ఇష్టం అని కుంభలంగి నైట్స్, ఆవేశం సినిమాలను ప్రస్తావిస్తాడు. దీనికి సమాధానంగా మోహన్ లాల్ మాట్లాడుతూ చాలామంది సీనియర్ టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు అని చెప్తాడు. దానికి సమానంగా ఆ వ్యక్తి ఓన్లీ ఫహద్ ఫాజిల్ అంటాడు. అక్కడితో మోహన్ లాల్ వెళ్ళిపోతాడు. ఈ టీజర్ తో ప్రస్తుతం మోహన్ లాల్ కి ఫాదర్ అంటే ఇష్టం లేదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బ్లాక్ బస్టర్ కంటెంట్
మోహన్ లాల్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలను ఎంచుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు. తాను తీసిన దృశ్యం సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడి నుంచే చాలామంది మోహన్ లాల్ తీసే ప్రతి సినిమాను ఫాలోఅవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు నటిస్తున్న హృదయపూర్వం సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.