Russia Earthquake: రష్యా తీరంలో కమ్చాట్కా ద్వీపకల్పం సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్కా నగరానికి 144 కిలోమీటర్ల తూర్పున, 20 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
7.4 తీవ్రతతో భూకంపం సంభవించడానిక కొద్ది నిమిషాల ముందు, అదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. దాదాపు గంట వ్యవధిలో ఐదు భూకంపాలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈ భూకంపాలు పసిఫిక్ మహా సముద్రంతో పాటు ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల స్థానంలో ఉన్న కమ్చాట్కా నగరానికి దగ్గరలో సంభవించాయి. ఇది సీస్మిక్ హాట్‌జోన్‌గా పిలువబడుతుంది.
పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంపాల సంభవించిన తర్వాత కమ్చాట్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఎందుకంటే ఈ ఐదు భూకంపాలు సముద్రంలోనే సంభవించాయి. సునామీ తీవ్రత 1 మీటరు వరకు ఉండవచ్చని సునమా హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. కమ్చాట్కా నగర జనాభా 1,80,000. రష్యా ప్రభుత్వం కూడా తీరప్రాంత నివాసులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతానికి సునామీ ప్రమాదం తగ్గిందని తెలిపింది.
అయితే.. భారీ భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు. ఆ తీరప్రాంతంలోని 300 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేశారు. అలస్కా అత్యవసర విభాగాలు, నేషనల్ గార్డ్ బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగించాయి.
ALSO READ: BANK JOBS: 5208 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా..
ALSO READ: Scholarship: చదువుకునే స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఈజీగా రూ.75,000 స్కాలర్‌షిప్ పొందండిలా..