Ms Dhoni – Sachin : భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంధ్రసింగ్ ధోనీ వంటి స్టార్ క్రికెటర్ల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. 2003లో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత టీమిండియా కి ఒక్కొక్క ఆటగాడు వైదొలగడం.. సరైన కెప్టెన్ లేకపోవడం.. 2007లో ఏకంగా బంగ్లాదేశ్ జట్టుతో ఓడిపోయి టీమిండియా వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. ఇలా టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా వచ్చి భారత్ జట్టుని ఆదుకున్నాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా విజయాల్లోకి వెళ్లడం.. టీ-20 తొలి వరల్డ్ కప్ సాధించడం వంటివి జరిగాయి.
Also Read : Tri-Series : ఈ 3 ట్రై సిరీస్ లు ఆడితే.. వరల్డ్ కప్ రేంజ్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే
ధోనీ పై సచిన్ ఫ్యాన్స్ ఆగ్రహం..
ఇక టీమిండియాలో సచిన్ టెండూల్కర్, వీరెంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లు డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. తొలిసారిగా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసింది మాత్రం సచిన్ టెండూల్కరే. అయితే ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ 192 రన్స్ కి చేరుకోగానే యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం డబుల్ సెంచరీ కొడుతాడనే కోరుకున్నారు. మరోక ఎండ్ లో ఉన్న ధోనీ మాత్రం సచిన్ కి అస్సలు స్ట్రైక్ ఇవ్వడం లేదు. లాస్ట్ 8 ఓవర్లలో సచిన్ ఆడింది కేవలం 12 బంతులు మాత్రమే. 48వ ఓవర్ పూర్తి అయ్యేటప్పటికీ సచిన్ 199 రన్స్ కొట్టేశాడు. 49వ ఓవర్ మొత్తం ఆడేసిన ధోనీ.. లాస్ట్ బాల్ కి సింగిల్ తీశాడు. అప్పటికే ధోనీ మీద సచిన్ చాలా కోపంగా ఉన్నాడు. సచిన్ ఫ్యాన్స్ సైతం ధోనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోనీ కావాలనే సచిన్ 200 కొట్టకుండా అడ్డుపడుతున్నాడని అనిపించింది.
సచిన్ డబుల్ సెంచరీ.. ధోనీ కావాలనే చేశాడా..?
కానీ ఎలాగో అలాగా సచిన్ లాస్ట్ ఓవర్ లో సింగిల్ తీసి డబుల్ సెంచరీ అయితే చేశాడు. ఇక ధోనీ కావాలనే ఇలా చేశాడా..? లేక తన ఆటను అలా ఆడాడా..? అనే సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. సచిన్ 196 రన్స్ కొట్టిన తరువాత లాస్ట్ 5 ఓవర్లలో ఒక బౌండరీ కొట్టినా సచిన్ 200 పూర్తి అయ్యేవి. స్కోర్ వేగం పెంచడానికి ధోనీ ఎక్కువగా స్గ్రైక్ తీసుకోవాల్సి వచ్చింది. అలా అని ధోనీ బాల్స్ మాత్రం వేస్ట్ చేయలేదు. ఆ మ్యాచ్ లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కావాలని సచిన్ టెండూల్కర్ 200 స్కోర్ ని ఆపాలని చూస్తే.. ఆ ప్రశ్నకు ధోనీ నే అంతకంటే గొప్ప ప్లేయర్ ఉన్నా సరే సచిన్ క్రికెట్ ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. అంత రిస్క్ కావాలనే చేశాడంటారా..? లేక ధోనీనే కావాలని చేశాడా..? అంటే అలాంటిదేమి లేదు. ఆటలో ఇలాంటి సహజంగా జరుగుతుంటాయి. సచిన్ డబుల్ సెంచరీ చేసేందుకు దగ్గరగా వచ్చాడు. కాబట్టి కాస్త మెల్లగా ఆడాడు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ ధోనీ స్కోర్ ని పెంచేందుకు వేగంగా ఆడాడు. సచిన్ 97, 98 పరుగులు చేసి చాలా సందర్భాల్లో ఔట్ అయ్యాడు. కాబట్టి డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా.. ఇలాంటి సంఘటనలు జరగడం సాధారణమే. అయినప్పటికీ సచిన్ అభిమానులు ధోనీ పై ట్రోలింగ్స్ చేయడం విశేషం.
?igsh=MTA3ZHQ0MzF4ZGtoYw==