E-Paper
Advertisement

Eesha Rebba: చీరకట్టులో యాక్షన్ సీక్వెన్స్ – ‘ఓం శాంతి’ మూవీ కోసం ఈషా రెబ్బ సాహసం!

Eesha Rebba: చీరకట్టులో యాక్షన్ సీక్వెన్స్ – ‘ఓం శాంతి’ మూవీ కోసం ఈషా రెబ్బ సాహసం!
Advertisement

Eesha Rebba:ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba), డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘ జయ జయ జయ జయహే ‘ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించారు.నేడు అనగా జనవరి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి మలయాళంలో కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. పైగా ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయింది. దీంతో చాలా మంది అప్పుడే ఈ సినిమా చూసేశారు. అలాంటి ఈ చిత్రానికి రీమేక్ చేయడం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. మరి ప్రేక్షకులను మెప్పించే అంత కంటెంట్ ఏదైనా కొత్తగా ఉందా అంటే ఇక సినిమా చూడాల్సిందే.

సినిమాకి హీరోగా నిలిచిన ఈషా రెబ్బా..

అలా ఒకవైపు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఈషా రెబ్బ తన అద్భుతమైన పాత్రతో మధ్య తరగతి కుటుంబంలో అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించిందని.. ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓర్పు, సహనం, ప్రేమ ఇలా అన్ని కోణాలు ఆడపిల్ల జీవితంలో ఉంటాయని చూపించి ఆకట్టుకుంది. అలాగే సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో అనే పవర్ఫుల్ యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అదరగొట్టేసింది. అలాంటి ఈమె తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఇందులో చీరకట్టులో సాహసం చేశాను..

Advertisement

అందులో భాగంగానే ఈ సినిమా కోసం చీరకట్టులో యాక్షన్ సీక్వెన్స్ చేసి పెద్ద సాహసమే చేశానని చెప్పుకొచ్చింది ఈషా రెబ్బా. ఇలాంటి శాంతి పాత్రలు చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. పైగా యాక్షన్ మూవీస్ లో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బయటకి శాంతి.. చీర కట్టుకొని మెడలో తాళిబొట్టు వేసుకొని చాలా సింపుల్ గా గృహిణి లా కనిపిస్తుంది. అసలు కథ సినిమాలో తెలుస్తుంది
నా పాత్రలో ఎన్నో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. పైగా ఇందులో చీర కట్టులో కూడా యాక్షన్స్ సీక్వెన్స్ చేశాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈమె నటన కోసమైనా సినిమా చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ఈషా రెబ్బా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ:Eesha Rebba: కారులోనే అమ్మ చనిపోయింది.. ఈషా రెబ్బా ఎమోషనల్!

తరుణ్ నిజంగానే కొట్టారు..

Advertisement

ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ నిజంగానే చెంపదెబ్బ కొట్టాడు అని చెప్పుకొచ్చింది.అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉండాలని.. అలాంటి వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పిన ఈమె ..తాను కెరియర్లో ఎదుగుతున్న సమయంలోనే తన తల్లి చనిపోయారని, అప్పుడు ఒంటరినయ్యానని ఎమోషనల్ అయింది.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×